చిత్రం: మృగరాజు (2001)
రచన: వేటూరి
గానం: హరిహరన్
సంగీతం: మణి శర్మ
జై జై జై..... రామయ్య పాదాలెట్టె సీతమ్మ పారాణెట్టె ఈ కొండ కోనసీమల్లో అహ పులకించే గుండెలోతుల్లో కోయోడు ఘంటం పట్టె బోయోడు గురిచూపెట్టె సింహాలు పొంచే దారుల్లో నరసింహాలు గెలిచే పోరుల్లో పులి పులి పులి పులి పులి పులి పులి పులి అదిగో పులితోక గిలి గిలి గిలి గిలి నటాల గిలి గిలి ఇదినా పొలికేక పులి పులి పులి పులి పులి పులి పులి పులి అదిగో పులితోక గిలి గిలి గిలి గిలి నటాల గిలి గిలి ఇదినా పొలికేక ఫెళా ఫెళా ఫెళ పంజా విసిరే బెబ్బులిలో శౌర్యం ఛలా ఛలా ఛల ఛెంగున ఎగిరే జింకలలలో వేగం చిమా చిమా చిమ చీమలబారులు చెప్పేనొక పాఠం మెరా మెరా మెర మెరుపుల్లో నెమలాటే ఒక నాట్యం మన్నైన ఇస్తుంది మాణిక్యాలెన్నో..... మానైనా చేస్తుంది త్యాగాలెన్నెన్నో అడవుల్లో ఉంటాయి అందాలెన్నెన్నో..... అడగకనే చెబుతాయి అర్ధాలింకెన్నో జిలిబిలి జిలిబిలి జిగేలు జిలిబిలి ఇదిగో నెమలీక చలి చలి చలి చలి కొరుక్కుతిను చలి ఇదిగో నిప్పుకాక జిలిబిలి జిలిబిలి జిగేలు జిలిబిలి ఇదిగో నెమలీక చలి చలి చలి చలి కొరుక్కుతిను చలి ఇదిగో నిప్పుకాక ఘనా ఘనా గజరాజు రాకకే గగనాలదరాలి మహా మహా మృగరాజు అడుగులో పిడుగులు రాలాలి గగనం భువనం అదిరిచెదిరి నా ఎదురే నిలవాలి గిరిలో తరిలో దరిలో ఝరిలో మనిషే గెలవాలి మృగమేదో దాగుంది మానవరూపంలో...... వెంటాడి వేటాడు మమతల చాపంతో వేటాడే ఒడుపున్న వేగుల చూపుల్లో...... కాపాడే గుణముంది కన్నుల రెప్పల్లో చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడుతో జతకాక తలబడి తడపడి చెరపడి దరిపడి గుంపును విడిపోక చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడుతో జతకాక తలబడి తడపడి చెరపడి దరిపడి గుంపును విడిపోక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి