చిత్రం: శుభవార్త (1998)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కోటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి: జాబిలమ్మా ఆగవమ్మా ఆలకించవా మదిలో మాట వేగిపోయే మూగప్రేమ విన్నవించే ఈ యద కోత అమావాస్యకే బలై మన కథ ఎటెళుతున్నదో నీకు తెలియదా..... నా బ్రతుకున బ్రతుకై ముడిపడిపోయిన ఓ ప్రియతమా...... అమావాస్యకే బలై మన కథ ఎటెళుతున్నదో నీకు తెలియదా..... జాబిలమ్మా ఆగవమ్మా ఆలకించవా మదిలో మాట వేగిపోయే మూగప్రేమ విన్నవించే ఈ యద కోత అమావాస్యకే బలై మన కథ ఎటెళుతున్నదో నీకు తెలియదా..... చరణం:1 నీ మనసున తన కొలువంటూ నిను చేరిన నా మది అనురాగపు మణిదీపముగా ఆ గుడిలో ఉన్నది ఏ కలతల సుడిగాలులకి ఆరని వెలుగే అది నువ్వు వెలివేయాలనుకున్నా నీ నీడై ఉన్నది ప్రాణమే ఇలా నిన్ను చేరగా.... తనువు మాత్రము శిలై ఉన్నది ఈ శిల చిగురించే చినుకే నీలో దాగున్నది జాబిలమ్మా ఆగవమ్మా ఆలకించవా మదిలో మాట వేగిపోయే మూగప్రేమ విన్నవించే ఈ యద కోత అమావాస్యకే బలై మన కథ ఎటెళుతున్నదో నీకు తెలియదా..... చరణం:2 కనివిని ఎరుగని కలయికగా అనిపించిన జీవితం ఎడబాటున కరిగిన గతమై చినబోయెను ఈ క్షణం విష జ్వాలలు విసిరిన అహమే మసి చేసెను కాపురం ఏ మసకల ముసుగులు లేని మమకారమే శాస్వతం ప్రణయమన్నది ఇదేనా అనీ.... మనని అడగదా లోకమన్నదీ.... బదులియ్యకపోతే ప్రేమకు విలువే పోదా మరీ జాబిలమ్మా ఆగవమ్మా ఆలకించవా మదిలో మాట వేగిపోయే మూగప్రేమ విన్నవించే ఈ యద కోత అమావాస్యకే బలై మన కథ ఎటెళుతున్నదో నీకు తెలియదా..... నా బ్రతుకున బ్రతుకై ముడిపడిపోయిన ఓ ప్రియతమా......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి