1, జనవరి 2024, సోమవారం

Aaro Pranam : Preminchava Song Lyrics (ప్రేమించవా ప్రియ నేస్తమా)

చిత్రం: ఆరో ప్రాణం (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర, అనుపమ

సంగీతం: వీరు.కే




ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా వరమియ్యనా ఒడి చేర్చనా నీ మారాం మానమ్మా జాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మా ఓ పూల బాణమా నా ఆరో ప్రాణమా ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా నీ కనుపాపలలోన ఓ కలనై రాలేనా నీ తలపులు క్షణమైనా నన్ను నిదరోనిస్తేనా ఒంటరి వేళలలోన నీ ఊహను కాలేనా తుంటరి తొందరలోన ఏమైనా తోచేనా అన్నీ మరిచి నిన్నే తలిచి ఏమైపోతున్నా ఏమో ఈ యాతన నాకైనా తెలుసునా ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా గాలుల గుసగుసలోన నీ ఊసులు వింటున్నా పువ్వుల మిసమిసలోన నీ నవ్వులు చూస్తున్నా నిలబడనీవే నన్ను ఒక నిమిషం పాటైనా కాలం కదలక నేను తెగ సతమతమౌతున్నా చిలిపిగా అల్లిన ఇంతటి అల్లరి ఏంటిది ప్రేమేనా ఔనేమో ప్రియతమా నా ఆరో ప్రాణమా ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా వరమియ్యనా ఒడి చేర్చనా నీ మారాం మానమ్మా జాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మా ఓ పూల బాణమా నా ఆరో ప్రాణమా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి