Aaro Pranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aaro Pranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జనవరి 2024, సోమవారం

Aaro Pranam : Vinnavantra Abbai Song Lyrics (విన్నవంట్రా అబ్బాయి.)

చిత్రం: ఆరో ప్రాణం (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జిక్కి, మనో, సుజాత మోహన్

సంగీతం: వీరు.కే




విన్నవంట్రా అబ్బాయి.. మీ అబ్బాయికి పాపం లవ్వయ్యిందంట నువ్వూ నీ ఇల్లాలు కలిసి ఓకే అంటే చాలు పెళ్ళవుతుందంట పేరెంట్సంటే పెళ్ళికి పిలిచే పేరంటాల్లా ఏమిటి నువ్వే చెప్పమ్మా మాక్కాబోయే కోడలు ఎవరో ఊరూ పేరూ గట్రా వివరాలేంటమ్మా చూడచక్కనిది.. నేనేంతో మెచ్చినది నన్ను దోచినది.. నాకెంతో నచ్చినది రంభా రోజా మీనాలాగా మురిసి మురిపించి మరిపించేలాగుంది పియా తూ అబ్ తో ఆజా షోలా సామన్ దహెకె ఆకే భుజజా తన్ కీ జ్వాల ఠండీ హోజాయ్ ఐసే గలే లగాజా ఆఅ హ ఆహ, ఆఅ హ ఆహ, ఆఅ హ ఆహ, ఆఅ హ ఆహ మోనికా ఓ మై డాటర్ !! మనీషా టాబు లాంటివాళ్ళు కోడలైతే నీకిష్టమా మమ్మీ వినవే పవిత్రబంధం సౌందర్యలాగా ఉంటేసరే ఆడపడుచే అర్థమొగుడని మోటు సామెత ఒకటుంది నీ అన్న పెళ్ళాం ఎట్టావుంటే నీకు ఇష్టం సిస్టర్ శ్రీ వచ్చే వదినతో ఇట్టావుంటే నీకే నష్టం నాన్నమ్మా అందం చందం చెప్పే వయసు నీదికాదే ముసలమ్మా చేతికి చెంబు మెడలో మాల కాశి శివకాశి నీకు తప్పవు నాన్నమ్మా చురాలియా హే తుమ్నేజో దిల్ కో నజర్ నహీ చురాన సనం లేలియా దిల్ ఓ హాయ్ మెరా దిల్ దిల్ లేకర్ ముజ్కో నా బెహ్లానా చురాలియా !! సుప్రీంకోర్టు జడ్జిమెంటు నీదెకాదా భార్యామణి అయితే ఇంకా ఆర్గ్యుమెంటు ఎందుకండీ నాకిష్టమే ఇంతమంది చెప్పినవన్నీ విన్నావ్ కదరా ఓ మై సన్ పాసయ్యిందో లేదో చెప్పి చప్పున తీర్చేయ్ మా టెన్షన్ అన్నివిధాలా నేనుకూడా అమ్మపోలికే కాబట్టి అచ్చంగా మీరనుకున్నట్టే ఉంటుందని నా గ్యారంటీ చూసారంటే నా మ్యారేజికి మీరే నాకన్నా తొందరపడతారండి



Aaro Pranam : Preminchava Song Lyrics (ప్రేమించవా ప్రియ నేస్తమా)

చిత్రం: ఆరో ప్రాణం (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర, అనుపమ

సంగీతం: వీరు.కే




ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా వరమియ్యనా ఒడి చేర్చనా నీ మారాం మానమ్మా జాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మా ఓ పూల బాణమా నా ఆరో ప్రాణమా ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా నీ కనుపాపలలోన ఓ కలనై రాలేనా నీ తలపులు క్షణమైనా నన్ను నిదరోనిస్తేనా ఒంటరి వేళలలోన నీ ఊహను కాలేనా తుంటరి తొందరలోన ఏమైనా తోచేనా అన్నీ మరిచి నిన్నే తలిచి ఏమైపోతున్నా ఏమో ఈ యాతన నాకైనా తెలుసునా ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా గాలుల గుసగుసలోన నీ ఊసులు వింటున్నా పువ్వుల మిసమిసలోన నీ నవ్వులు చూస్తున్నా నిలబడనీవే నన్ను ఒక నిమిషం పాటైనా కాలం కదలక నేను తెగ సతమతమౌతున్నా చిలిపిగా అల్లిన ఇంతటి అల్లరి ఏంటిది ప్రేమేనా ఔనేమో ప్రియతమా నా ఆరో ప్రాణమా ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మా వరమియ్యనా ఒడి చేర్చనా నీ మారాం మానమ్మా జాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మా ఓ పూల బాణమా నా ఆరో ప్రాణమా



Aaro Pranam : Pedaviki Pedavi Song Lyrics (పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు)

చిత్రం: ఆరో ప్రాణం (1997)

సాహిత్యం: చంద్రబోస్

గానం: లావణ్య, మనో

సంగీతం: వీరు.కే



పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు మనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దు చలి దోపిడి ఈ ముద్దు తొలి అలజడి ఈ ముద్దు ఎద సందడి ఈ ముద్దు యమ సంబరమీ ముద్దు మాట దాటొద్దు మారాం చెయ్యొదు ఘాటు ముద్దిచ్చి నాలో నిన్నే కలిపేట్టు పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు మనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దు మెడలో చేరే ఓ ముద్దు ముత్యాల ముద్దు ముడికే జారే ఆ ముద్దు వరహాల ముద్దు చెవినే తాకే ఓ ముద్దు సన్నాయి ముద్దు చేతికి అందే ఓ ముద్దు చేసింది సద్దు పాపిట చెదిరే ఓ ముద్దు పడకింటి ఆ ముద్దు నడుమును తడిమే ఓ ముద్దు తుడుచేసె సరిహద్దు గాలి మువ్వల్లో కానుక ఓ ముద్దు అన్ని ముద్దుల్లో వద్దు మాకు మునకేద్దు పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు మనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దు పొద్దున ఇచ్చే ఓ ముద్దు పొరపాటు ముద్దు చీకటి పడితే ఆ ముద్దు అలవాటు ముద్దు నిద్దుర చంపే ఓ ముద్దు నిజమైన ముద్దు వద్దని ఇచ్చే ఆ ముద్దు అసలైన ముద్దు చెక్కెర పంచే ఓ ముద్దు చెలికాడి తొలిముద్దు చుక్కలు చుపే ఓ ముద్దు మణి కోరే మలి ముద్దు నన్ను ఆపొద్దు నిమిషం నిలవద్దు తేనె ముద్దిచ్చి తోడు నీడై గడిపేయ్ పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు మనసుకు మనసే చేసే మూగ సైగ ముద్దు చలి దోపిడి ఈ ముద్దు తొలి అలజడి ఈ ముద్దు ఎద సందడి ఈ ముద్దు యమ సంబరమీ ముద్దు మాట దాటొద్దు మారాం చెయ్యొదు ఘాటు ముద్దిచ్చి నాలో నిన్నే కలిపేట్టు