చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
గోగులు పూచే.గోగులు
కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే
వారెవరమ్మ ఓ లచ్చ
గుమ్మాడి
గోగులు పూచే.గోగులు
కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే
వారెవరమ్మ ఓ లచ్చ
గుమ్మాడి
ఓ లచ్చ గుమ్మాడి.ఈ.ఈ ఓ
లచ్చ గుమ్మాడి
పొద్దు పొడిచే పొద్దు
పొడిచే.ఓ లచ్చా
గుమ్మాడి
పుత్తడి వెలుగులు
కొత్తగా మెరిసే.ఓ లచ్చా
గుమ్మాడి
పొద్దు పొడిచే పొద్దు
పొడిచే.ఓ లచ్చా
గుమ్మాడి
పుత్తడి వెలుగులు
కొత్తగా మెరిసే.ఓ లచ్చా
గుమ్మాడి
పొద్దు కాదది.
నీ.ఈ.ముద్దు మోమున
దిద్దిన కుంకుమ
తిలకమే.ఏ.సుమా.ఆ
పొద్దు కా.ఆ.దది.
నీ.ఈ.ముద్దు మోమున
దిద్దిన కుంకుమ
తిలకమే.ఏ.సుమా.ఆ
వెలుగులు కావవి.నీ
పాదాలకు అలదిన పారాణీ.
ఆహ.
హ.జిలుగులే సుమా.ఆ.ఆ
ముంగిట వేసిన ముగ్గులు
చూడు .ఓ లచ్చా గుమ్మాడి
ముత్యాలా ముగ్గులు
చూడు .ఓ లచ్చా గుమ్మాడి
ముంగిట వేసిన ముగ్గులు
చూడు .ఓ లచ్చా గుమ్మాడి
ముత్యాలా ముగ్గులు
చూడు .ఓ లచ్చా గుమ్మాడి
ముంగిలి కాదది.నీ
అడుగులలో పొంగిన పా.ల
కడలియే సుమా.ఆ
ముంగిలి కాదది.నీ
అడుగులలో పొంగిన పా.ల
కడలియే సుమా.ఆ
ముగ్గులు కావవి.నా
అంతరంగాన పూచిన
రంగవల్లులే.ఏ.ఏ.సుమా.ఆ.ఆ
మల్లెలు పూచే మల్లెలు
పూచే .ఓ లచ్చా గుమ్మాడి
వెన్నెల కాచే వెన్నెల
కాచే .ఓ లచ్చా గుమ్మాడి.
మల్లెలు పూచే మల్లెలు
పూచే .ఓ లచ్చా గుమ్మాడి
వెన్నెల కాచే వెన్నెల
కాచే .ఓ లచ్చా గుమ్మాడి.
మల్లెలు కావవి నా
మహలక్ష్మి విరజల్లిన
సిరినవ్వులే.ఏ.ఏ.
సుమా.ఆ.ఆ
మల్లెలు కావవి నా
మహలక్ష్మి విరజల్లిన
సిరినవ్వులే.ఏ.ఏ.
సుమా.ఆ.ఆ
వెన్నెల కాదది వేళ
తెలిసి.ఆ జాబిలి వేసిన
పానుపే.ఏ.ఏ.ఏ. సుమా.ఆ.ఆ.ఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి