చిత్రం: నువ్వే నా ప్రేయసి (1992)
రచన: రాజశ్రీ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం:దేవా
ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుక అడిగా నీ దర్శనం మాట తోనే ఆటలాడే నాటకమే చాలునమ్మ చెంతకురావే ఈ క్షణమే పాడితే ప్రతి పలుకులో స్వరం నీది కదా వెతికితే కనిపించవా ఇది వింత కదా ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుక అడిగా నీ దర్శనం సుగంధాలు జల్లే పువ్వా ఎక్కడుంది నీ చిరునామా, గాలిలాగ గాలిస్తూనే తిరిగానే నే తిరిగానే, నిన్ను కోరి పాడి పాడి కళ్ళు తెరచి చూసి చూసి కానరాక కన్నీళల్లో మునిగానే నే మునిగానే ఎందుకో మనసెందుకో నీ ఊహలో కరిగే రేగిన సుడి గాలిలా అన్వేషణలో తిరిగే పాట లోన పరవశించే నీ పలుకే వున్న ప్రాణం పోకముందే రావేచెలి మాట తోనే ఆటలాడే నాటకమే చాలునమ్మ చెంతకురావే ఈక్షణమే, ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుక అడిగా నీదర్శనం ఒక్క సారి కంటి నిండా నిన్ను చూసుకున్న చాలు చుపుదీపమారిపోని అటుపైనే నా ప్రియరాణి నిన్ను చూడలేని వేళా చావు నన్ను చేరుకున్న కళ్ళు రెండు మూతలు పడవే ఏమైనా కాసేపైనా నాదని ఇక లేదని నా బ్రతుకే నీదని తెలుసుకో నను కలుసుకో నీ మనసును మార్చుకొని ప్రేమ శాపం అందచేసే దేవతవే కలలలోనే కదలిసాగే ప్రేయసివే మాట తోనే ఆటలాడే నాటకమే చాలునమ్మ చెంతకురావే ఈ క్షణమే ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుక అడిగా నీ దర్శనం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి