చిత్రం: పాపకోసం(1990)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
పల్లవి: జల్లమ్మో జల్లు ఒళ్లంతా ఝల్లు ఎగిసే ఊహల్లో తెగ బిగిసే సంకెళ్లు॥2॥ అనురాగం సత్యం ఆ దేవుడు సాక్ష్యం ఇది దేవుడు చల్లిన దీవెనలల్లిన కౌగిళ్లు... జల్లమ్మో జల్లు ఒళ్లంతా ఝల్లు ఎగిసే ఊహల్లో తెగ బిగిసే సంకెళ్లు చరణం:1 చినుకే ముత్యాల పంట ఈ వణుకే వయ్యారి మంట మెరిసే మేఘాల ఇంట ఆ ఉరుమే కళ్యాణ గంట నిరుపేద గూటిలోన సిరికన్నె కాపురం నిలువెల్ల పాదమైతే వలపే మణిగోపురం రెక్కలు విప్పిన నా హృదయం రేయికి పగటికి సమనిలయం రేకులు తడిసిన నా బిడియం రేపటి వాకిటి సుమవలయం అనురాగం నాదం అది జీవనవేదం ఇది వేదం చల్లిన భావనలల్లిన కౌగిళ్లు... జల్లమ్మో జల్లు ఒళ్లంతా ఝల్లు ఎగిసే ఊహల్లో తెగ బిగిసే సంకెళ్లు చరణం:2 మదిలో ఓ మాట ఉంది అది పెదవిని అంటుకోనంది గుండెపై తలొగ్గి వింటే ఆ గుట్టు నే చెబుతానంది రాశావు శ్వాసతోని రమణీయ లేఖలు గీసావు చూపుతోని ఆశించిన రేఖలు ఎల్లలు దాటే ఆవేశం అల్లరి మధనుని ఆదేశం ఇది నవసంగమ సుముహూర్తం ఇది ప్రణయానికి పరమార్థం అనురాగం ప్రాణం అది పలికే మౌనం ఇది మౌనం చల్లిన మధురిమలల్లిన కౌగిళ్లు... జల్లమ్మో జల్లు ఒళ్లంతా ఝల్లు ఎగిసే ఊహల్లో తెగ బిగిసే సంకెళ్లు అనురాగం సత్యం ఆ దేవుడు సాక్ష్యం ఇది దేవుడు చల్లిన దీవెనలల్లిన కౌగిళ్లు... జల్లమ్మో జల్లు ఒళ్లంతా ఝల్లు ఎగిసే ఊహల్లో తెగ బిగిసే సంకెళ్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి