చిత్రం: నేటి భారతం (1983)
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: ఎస్.జానకి
సంగీతం: చక్రవర్తి
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం స్వాగతం... బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం స్వాగతం... మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటి జీవితంలో వెలుగులను ప్రసరింపజేసిన కాంతిమూర్తీ స్వాగతం మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అంతు తెలియని యాతనలతో అలమటించే ఆర్తజనులకు కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలీ స్వాగతం మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం పనికిరావని పారవేసిన మోడువారిన జీవితాలకు చిగురుటాశల దారి చూపిన మార్గదర్శీ స్వాగతం మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం స్వాగతం... బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం.. స్వాగతం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి