15, జనవరి 2024, సోమవారం

Prati Roju Pandage : Prati Roju Pandaage Song Lyrics (మెరిసాడే మెరిసాడే)

చిత్రం: ప్రతి రోజు పండగే (2019)

రచన: కృష్ణకాంత్

గానం: శ్రీ కృష్ణ

సంగీతం: ఎస్. థమన్


పల్లవి:

మెరిసాడే మెరిసాడే - పసివాడై మెరిసాడే

మెరిసాడే మెరిసాడే - పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే - సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అలుపింకా మరిచాడే మనసంతా వెలుగేలా..... ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే పదిమంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే - పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే - సరదాలో మునిగాడే చరణం:

గలగల మాటల సడిలో - బరువిక తేలికపడెలే ఇరుకుగ మారితే గదులే - చురుకుగ ప్రాణమె కదిలే మనమంతా కలిసుంటే - కలతున్నా మరిచేనే మనమంతా వెనకుంటే - మరణాన్నే గెలిచేనే మిము కలువగా తెగ కలవరం - అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం - ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళకో రారు కన్నోళ్ళిలా - వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇళ్ళంతా మారింది సందళ్ళుగా - మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేలా..... ఇక చీకటెళ్ళింది తెళ్ళారి నీ నవ్వుతోనే పదిమంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి