చిత్రం : తొలి కోడి కూసింది (1980)
సంగీతం : ఎం.యస్. విశ్వనాథన్
రచన : ఆరుద్ర
గానం: యస్.జానకి
అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ... అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా చెల్లెమ్మా, అందమైంది కానే కాదు చెల్లెమ్మ
అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ... అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా చెల్లెమ్మా, అందమైంది కానే కాదు చెల్లెమ్మ ఆకలి, ఆశలు ఈ లోకానికి మూలమమ్మ ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మ ఆకలికి అందముంద రామ రామ... ఆశలకు అంతముంద చెప్పమ్మా చెల్లెమ్మా ఆశలకు అంతముంద చెప్పమ్మా... అందమైన లోకమని.......
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది..... పాలు తాగి మనిషి, విషమవుతాడు గడ్డి మేసి ఆవు పాలిస్తుంది... పాలుతాగి మనిషి విషమవుతాడు... అది గడ్డి గొప్పతనమా ఇది పాలు దోష గుణమా, అది గడ్డి గొప్పతనమా.. ఇది పాలుదోషగుణమా,.... మనిషి చాలా దొడ్డోడమ్మ చెల్లెమ్మా, చెల్లెమ్మా..తెలివిమిరి చేడ్డడమ్మ చిన్నమ్మ అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ... అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా....
ముద్దుగులాబికి ముళ్ళుంటాయి.. మొగలి పువ్వులోన నాగుంటాడి.... ముద్దుగులాబికి ముళ్ళుంటాయి.. మొగలి పువ్వులోన నాగుంటాడి.... ఒక మెరుపు వెంట పిడుగు..... ఒక మంచిలోన చెడుగు... ఒక మెరుపు వెంట పిడుగు.... ఒక మంచిలోన చెడుగు.... లోకమంతా ఇదేతీరు చెల్లెమ్మా.. చెల్లెమ్మా లోతులోని కథే ఇది పిచ్చమ్మ.....
అందమైన లోకమని..అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ... అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా....
. డబ్బు పుట్టి మనిషి చచ్చడమ్మ పేదవాడు నాడే పుట్టడమ్మ
డబ్బు పుట్టి మనిషి చచ్చడమ్మ పేదవాడు నాడే పుట్టడమ్మ అవున్నవాడు తినడు... ఈ పేదను తిననివ్వడు..... ఆ వున్నవాడు.......తినడు ఈ పేదను తిననివ్వడు.... కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మ ఈ లోకం కుళ్లునువ్వు చూడలేవు చిన్నమ్మ అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ... అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి