23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

Kondaveeti Simham : Maa Intilona Mahalakshmi Song Lyrics (మా ఇంటిలోన మహలక్ష్మి నీవే)

చిత్రం: కొండవీటి సింహం (1981)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి: మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్నా చిరునవ్వు నీవే నీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహలక్ష్మి నీవే చరణం 1: గోరంత పసుపు నీవడిగినావు .. నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం .. త్యాగాలమయమై సంసారబంధం నీ చేయి తాకి చివురించె చైత్రం .. ఈ హస్తవాసే నాకున్న నేస్తం .. అనురాగ సూత్రం !! మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే మీ కంట తడిని నే చూడలేను చరణం 2: మా అమ్మ నీవై కనిపించినావు .. ఈ బొమ్మనెపుడో కదిలించినావు నిను చూడగానే పొంగింది రక్తం .. కనుచూపులోనే మెరిసింది పాశం నీ కంటి చూపే కార్తీకదీపం .. దైవాలకన్నా దయ ఉన్న రూపం .. ఈ ఇంటి దీపం !!! మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే మీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి