24, మార్చి 2024, ఆదివారం

Akbar Saleem Anarkali : Reyi Aagiponee Song Lyrics (రేయి ఆగిపోనీ..)

చిత్రం : అక్బర్ సలీమ్ అనార్కలి (1979 )

గానం: మహమ్మద్ రఫీ,పి. సుశీల

రచయిత : సి.నారాయణ రెడ్డి

సంగీతం : సి. రామచంద్ర


పల్లవి  :

రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ ఈప్రేమ వాహిని..యీ ఇలా సాగిపోనీ.. రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ ఈ ప్రేమ వాహినీ..యీ ఇలా సాగిపోనీ.. రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ..

చరణం 1 :

ఆ..స్వర్గమైనా ఈలోకమైనా.. అనురాగధారలో.. అలా వీగిపోనీ.. ఆ స్వర్గమైనా.. ఈ లోకమైనా.. అనురాగధారలో.. అలా వీగిపోనీ నాతోడు నీ..వై నీతోడు నే..నై నాతోడు నీ..వై నీతోడు నే..నై ఈప్రేమ రాగిణి ఇలా మ్రోగిపో..నీ.. యీ రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ..

చరణం 2 :

ఈ గానమే..మౌనమై.. నిండిపో..నీ.. ఈ ప్రాణమే..ధ్యానమై.. ఉండిపో..నీ.. ఈ గానమే..మౌనమై.. నిండిపో..నీ.. ఈ ప్రాణమే..ధ్యానమై.. ఉండిపోనీ నీ..పొందులో..న ఈతీపిలోనా.. నీ పొందులోనా.. ఈతీపిలోనా ఈ ప్రేమయామినీ..యీ ఇలా కాగిపోనీ.. రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ..

చరణం 3 :

ఏ నాటికైనా.. నా మోముపైన.. ఈ కురుల నీడలే.. ఇలా మూగిపో..నీ.. ఏ నాటికైనా నా మోముపైన ఈకురుల నీడలే.. ఇలా మూగిపో..నీ.. నీ తలపులో..న.. ఈ పిలుపులో..న నీ తలపులో..న.. ఈ పిలుపులో..న ఈ ప్రేమయోగినీ.. ఇలా దాగిపో..నీ.. రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ.. ఈ ప్రేమ వాహినీ.. ఇలా సాగిపో..నీ.. రేయి ఆగిపో..నీ.. రేపు ఆగిపోనీ..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి