Akbar Saleem Anarkali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Akbar Saleem Anarkali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మార్చి 2024, ఆదివారం

Akbar Saleem Anarkali : Reyi Aagiponee Song Lyrics (రేయి ఆగిపోనీ..)

చిత్రం : అక్బర్ సలీమ్ అనార్కలి (1979 )

గానం: మహమ్మద్ రఫీ,పి. సుశీల

రచయిత : సి.నారాయణ రెడ్డి

సంగీతం : సి. రామచంద్ర


పల్లవి  :

రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ ఈప్రేమ వాహిని..యీ ఇలా సాగిపోనీ.. రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ ఈ ప్రేమ వాహినీ..యీ ఇలా సాగిపోనీ.. రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ..

చరణం 1 :

ఆ..స్వర్గమైనా ఈలోకమైనా.. అనురాగధారలో.. అలా వీగిపోనీ.. ఆ స్వర్గమైనా.. ఈ లోకమైనా.. అనురాగధారలో.. అలా వీగిపోనీ నాతోడు నీ..వై నీతోడు నే..నై నాతోడు నీ..వై నీతోడు నే..నై ఈప్రేమ రాగిణి ఇలా మ్రోగిపో..నీ.. యీ రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ..

చరణం 2 :

ఈ గానమే..మౌనమై.. నిండిపో..నీ.. ఈ ప్రాణమే..ధ్యానమై.. ఉండిపో..నీ.. ఈ గానమే..మౌనమై.. నిండిపో..నీ.. ఈ ప్రాణమే..ధ్యానమై.. ఉండిపోనీ నీ..పొందులో..న ఈతీపిలోనా.. నీ పొందులోనా.. ఈతీపిలోనా ఈ ప్రేమయామినీ..యీ ఇలా కాగిపోనీ.. రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ..

చరణం 3 :

ఏ నాటికైనా.. నా మోముపైన.. ఈ కురుల నీడలే.. ఇలా మూగిపో..నీ.. ఏ నాటికైనా నా మోముపైన ఈకురుల నీడలే.. ఇలా మూగిపో..నీ.. నీ తలపులో..న.. ఈ పిలుపులో..న నీ తలపులో..న.. ఈ పిలుపులో..న ఈ ప్రేమయోగినీ.. ఇలా దాగిపో..నీ.. రేయి ఆగిపోనీ.. రేపు ఆగిపోనీ.. ఈ ప్రేమ వాహినీ.. ఇలా సాగిపో..నీ.. రేయి ఆగిపో..నీ.. రేపు ఆగిపోనీ..


10, ఆగస్టు 2021, మంగళవారం

Akbar Saleem Anarkali : Sipaayee Sipaayee Song Lyrics (సిపాయి... సిపాయి)

చిత్రం: అక్బర్ సలీమ్ అనార్కలి (1979 )

సంగీతం: సి. రామచంద్ర

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం:  మహమ్మద్ రఫీ, పి. సుశీల



సిపాయి... సిపాయి సిపాయి... సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి సిపాయి ఓ... సిపాయి హసీనా... హసీనా నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ... హసీనా చరణం : 1 జడలోని మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో కురులూగితే (2) నీ చేయి సోకెనని అనుకున్నా ఆ... మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే ఆ గాలిలో చెలరేగినవి... (2) నా నిట్టూరుపులే... హసీనా ఓ... హసీనా ॥ఎంత॥ చరణం : 2 తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసిపోతాయి ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు బ్రతుకంతా ఉండిపోతాయి ఆ... లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే మన ఊపిరిలో పులకించినవి (2) వలపు బాటలే... సిపాయి ఓ... సిపాయి నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ... హసీనా సిపాయి ఓ... సిపాయి హసీనా ఓ... హసీనా