27, మార్చి 2024, బుధవారం

Andhrudu : Gundello Emundo Song Lyrics (గుండెల్లొ ఏముందొ)

చిత్రం: ఆంధ్రుడు (2005)

రచన: భాస్కరభట్ల రవి కుమార్

గానం: రంజిత్, సాహితీ

సంగీతం: కళ్యాణి మాలిక్



పల్లవి  :

గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం

చరణం : 1

ఇన్నాళ్ళు ఎవరికి వారె ఏమి కారె మరి ఏమైందొ ఏకం అయ్యారే దూరాన్నె దూరం దూరం పోపొమ్మంటు చిత్రంగ చేతులు కలిపారే ఇది మనసు చేసిన ఓ వింత గారడి కాబట్టె బంధం కుదిరిందే ఇపుడె కద మొదలంట దీనికి చివరేదంట తెలిసె వీలె లేదే గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం

చరణం : 2

బంధుత్వాలన్ని దైవం ఇచ్చినవేలే స్నేహాన్ని నువ్వె వెతికావే త్యాగానికి అర్ధం వుంటె రానిస్తుందే చెలిమయ్యి నిన్నల్లేసిందే ద్వేషంతొ శ్రీకారం చుట్టింది ఈ బంధం ఇంకెన్ని మలుపులు తిరిగేనో కాలం గడిచేదాక తీరం చేరేదాక తెలిసె వీలె లేదే గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి