Andhrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Andhrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2024, బుధవారం

Andhrudu : Pari Aayi Song Lyrics (పరి ఆఈ పరి దేశి బబువా)

చిత్రం: ఆంధ్రుడు (2005)

రచన: భువన చంద్ర

గానం: కళ్యాణి మాలిక్, మాతంగి

సంగీతం: కళ్యాణి మాలిక్




పరి ఆఈ పరి దేశి బబువా షరీమాయీ తుజె దేఖ్ బబువా పరి ఆఈ పరి దేశి బబువా షరీమాయీ తుజే దేఖ్ బబువా గుల్ హన్ బనకే సామన బాటీ హట్ సే వివాహ కర్లేనా ఆవ్ ఏక్ చుమ్మా ఏక్ చుమ్మా ఏక్ చుమ్మా సేసే జాయేతో గీల్ జాయే ముకడా దిల్ సే దిల్ మె లాయే తో గీర్ జాయే పరదా ఎదురొస్తే చడతావే పులసా ఎదురీతే మన రూటు తెలుసా ఎదురొస్తే చడతావే పులసా ఎదురీతే మన రూటు తెలుసా సరసం అన్నా సమరం అన్న ఆంధ్రుడు తయారే మొనాలిసా ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి చూపు కలిపేస్తే బిగిస్తానే పఠక ముల్లోకాలు ఒక్కటైనా జమాయిస్తా జటకా పరి ఆఈ పరి దేశి బబువా పల్కె కే బదలే కే మరియా దు నిరే తుజ్కో సాజనా అఖియెమ్మె అఖియో తూటాలు కే సపనోమ్మే లే జర్ సాజనా అందం ఆడే ఆటా తెలుసు మౌనం ఆడే మాటా తెలుసు ఆపై జరిగే వెటా తెలుసు దిల్ వాలీ వలువజాక్షిణ వయ్యారి భామ వగలు చాలిక ఆపవే కంటి చూపులు ఏ చోట ఉన్నా మనసు చూపే వేరులె గోరె గోరె గాళ్లు దేఖో లాలే లాలే బాళ్ళు దేఖో లాల్లు లాల్లు ఉటు దేఖో పరువాన అదిరిందే కథ రామ చిలకా ఇట్టాయినా పరువాల చురకా సజ్ భజ్ కే సామను ఆయి దిల్ మాంగే జో కర్లేనా ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి చూపు కలిపేస్తే బిగిస్తానే పఠక ముల్లోకాలు ఒక్కటైనా జమాయిస్తా జటకా దిల్ సే దిల్ మె లాయే తో గీర్ జాయే పరద దిల్ సే దిల్ మె లాయే తో గీర్ జాయే పరదా

Andhrudu : Osari Preminchaka Song Lyrics (ఓ సారి ప్రేమించాక)

చిత్రం: ఆంధ్రుడు (2005)

రచన: చంద్రబోస్

గానం: కె.కె.

సంగీతం: కళ్యాణి మాలిక్



పల్లవి  :

ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక మరుపంటు రానే రాదమ్మా ఓ సారి కలగన్నాక ఊహల్లొ కలిసున్నాక విడిపోయె వీలే లేదమ్మా నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా ఆరాటాలె ఎగసి అనువు అనువు తడిసి ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక మరుపంటు రానే రాదమ్మా

చరణం : 1

అనుకోకుండా నీ ఎదనిండా పొంగింది ఈ ప్రేమా అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమా అనుకోని అతిధిని పొమ్మంటు తరిమే అధికారం లేదమ్మా స్వార్ధం లేనీ త్యాగాలనే చేసేదే ఈ ప్రేమా త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక మరుపంటు రానే రాదమ్మా ఓ సారి కలగన్నాక ఊహల్లొ కలిసున్నాక విడిపోయె వీలే లేదమ్మా నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా ముత్యంలాగా మెరిసి సత్యాలెన్నొ తెలిపి ముందుకు నిన్నే నడిపింది ప్రేమా

Andhrudu : Gundello Emundo Song Lyrics (గుండెల్లొ ఏముందొ)

చిత్రం: ఆంధ్రుడు (2005)

రచన: భాస్కరభట్ల రవి కుమార్

గానం: రంజిత్, సాహితీ

సంగీతం: కళ్యాణి మాలిక్



పల్లవి  :

గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం

చరణం : 1

ఇన్నాళ్ళు ఎవరికి వారె ఏమి కారె మరి ఏమైందొ ఏకం అయ్యారే దూరాన్నె దూరం దూరం పోపొమ్మంటు చిత్రంగ చేతులు కలిపారే ఇది మనసు చేసిన ఓ వింత గారడి కాబట్టె బంధం కుదిరిందే ఇపుడె కద మొదలంట దీనికి చివరేదంట తెలిసె వీలె లేదే గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం

చరణం : 2

బంధుత్వాలన్ని దైవం ఇచ్చినవేలే స్నేహాన్ని నువ్వె వెతికావే త్యాగానికి అర్ధం వుంటె రానిస్తుందే చెలిమయ్యి నిన్నల్లేసిందే ద్వేషంతొ శ్రీకారం చుట్టింది ఈ బంధం ఇంకెన్ని మలుపులు తిరిగేనో కాలం గడిచేదాక తీరం చేరేదాక తెలిసె వీలె లేదే గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం

10, నవంబర్ 2021, బుధవారం

Andhrudu : Pranamlo Pranamga Song Lyrics (ప్రాణం లో ప్రాణంగా )

చిత్రం: ఆంధ్రుడు (2005)

రచన: చంద్రబోస్

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: కళ్యాణి మాలిక్



ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా.. బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.. మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా.. ఇలా ఇలా... నిరాశగా... నది దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ఆ.. ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా.. బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.. చరణం :స్నేహం నాదే, ప్రేమా నాదే, ఆ పైన ద్రోహం నాదే ... కనులు నావె, వేలు నాదే, కన్నీరు నాదే లే.. తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే.. ఎడారి లొ తుఫాను లొ తడి ఆరుతున్న తడి చూడకున్నా ఎదురేది అన్నా... ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా.. బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.. చరణం :ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఊటమి నాదే ఈ.. మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్లే మిగిలానే నా జాతకాన్నె, నా చేతి తోనే, నే మార్చి రాశానే.. గతానిపై సమాధినై, బ్రతిమాలుతున్నా, స్థితి మారుతున్నా, బ్రతికేస్తు ఉన్నా ఆ.. ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా.. బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.