9, మార్చి 2024, శనివారం

Antham : Chalekki Undanuko Song Lyrics (చలెక్కి ఉందనుకో)

చిత్రం: అంతం (1992)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.ఎస్.చిత్ర, జో జో

సంగీతం: మణి శర్మ


పల్లవి:

చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావో వలేస్తానంటావో ఇలాగే ఉంటావో చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో

చరణం: 1 చీకటుందని చింతతో నడి రాతిరి నిదరోలేదుగా కోటి చుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా చీకటుందని చింతతో నడి రాతిరి నిదరోలేదుగా కోటి చుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా నలుదిక్కులలో నలుపుందనుకో చిరునవ్వులకేం పాపం వెలుగివ్వనని ముసుగేసుకొని మసిబారదు ఏ దీపం చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావో వలేస్తానంటావో ఇలాగే ఉంటావో

చరణం: 2 కారునల్లని దారిలో ఏ కలల కోసమో యాతన కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోన కారునల్లని దారిలో ఏ కలల కోసమో యాతన కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోన కలలన్నింటిని వినిపించుకొని నిలవేసిన ఆ కళ్ళని వెలివేసుకొని వెళిపోకు మరి విలువైన విలాసాన్ని చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో చిట్క్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావో వలేస్తానంటావో ఇలాగే ఉంటావో చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి