చిత్రం: అంతం (1992)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కె.ఎస్.చిత్ర
సంగీతం: ఆర్. డి. బర్మన్
పల్లవి:
ఎంతసేపైనా ఎదురుచూపేనా నా గతి
ఎంతకీరాడు ఏమిటొగాని సంగతి
ఈవేళ ఈచోటని రమ్మంది తానేనని
ఈవేళ ఈచోటని రమ్మంది తానేనని
బొత్తిగా మరిచి పోయాడో ఎమిటొ
ఎంతసేపైనా ఎదురుచూపేనా నా గతి
ఎంతకీరాడు ఏమిటొగాని సంగతి
చరణం:1
ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా అతనినేగా నమ్ముకుంటున్నా వెక్కిరించే వేయిమందున్నా ఒక్కదాన్నె వేగిపోతున్నా ఎన్నాళ్ళు ఈ యాతన ఎట్టాగ ఎదురిదనా ఎన్నాళ్ళు ఈ యాతన ఎట్టాగ ఎదురిదనా ఏలుకోడేమి నారాజు చప్పున
చరణం:2
తోడులేని ఆడవాళ్ళంటే కోడేగాళ్ళు చూడలేరంతే తోడేళ్ళే తరుముతూ ఉంటే - తప్పుకోను తప్పుకోను తోవలేకుందే ఊరంతా ఉబలాటం నావెంటనే ఉన్నదే ఊరంతా ఉబలాటం నావెంటనే ఉన్నదే ఏమి లాభం గాలితో చెప్పుకుంటే ఎంతసేపైనా ఎదురుచూపేనా నా గతి ఎంతకీరాడు ఏమిటొగాని సంగతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి