చిత్రం : బృందావనం(1992 )
సంగీతం : మాధవపెద్ది సురేష్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి :
అతడు: ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అతివలకింత పంతమా... ఓ... అలకలు వారి సొంతమా ఆమె: ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా పదే పదే అదే వెటకారమా అతివలు అంత సులభమా... ఓ... శ్రుతి ఇక మించనీకుమా... చరణం : 1
అ: మాటే వినకుంటే బైటే పడుకుంటే మంచే పడునంట మంచే చెబుతుంటా ఆ: అమ్మో మగవారు అన్నిటా తగువారు హద్దే మరిచేరు చాలిక ఆ జోరు అ: కోపం తీరాలంట తాపం తగ్గాలంట ఆ: తాపం తగ్గాలంటే చొరవే మానాలంట అ: మాటామంతీ మర్యాదే అపచారమా.. ఆమె: ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా పదే పదే అదే వెటకారమా అతివలకింత పంతమా... ఓ... అలకలు వారి సొంతమా చరణం : 2
అ: నెయ్యం తియ్యంగా చెయ్యగ రమ్మంటా వియ్యాల పందిట్లో కయ్యం తగదంట ఆ: గిల్లికజ్జాలే చెల్లవు పొమ్మంటా అల్లరి చాలిస్తే ఎంతో మేలంట అ: వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట ఆ: కొంటెకుర్రాళ్లకూ అదియే సరియంట అ: తగనీ తెగనీ తగువంతా తన నైజమా అతడు: ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా ఆమె:అతివలు అంత సులభమా... ఓ... శ్రుతి ఇక మించనీకుమా... అతడు: ఓహో ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి