29, మార్చి 2024, శుక్రవారం

Pournami : Ichi Pucchukunte Song Lyrics (ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది )

చిత్రం: పౌర్ణమి (2006)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: టిప్పు, సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

పల్లవి :

హే ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హై

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

మూర్తమెందుకు మురిపాల విందుకు

ముందు ముందుకు మితిమీరమెందుకు

అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని

నువ్వేంటిలాగా హయ్యో కన్యామణి.. మణి.. మణి...

హే ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

చరణం:1

ఊ మహారాజా హై హై

నువ్వు వున్న మాట ఒప్పుకుంటే పోదా

ఈ జింక మీద బెంగ పుట్ట లేదా 

ఓ ఓ మూళ్ళ రోజా హాయ్ హాయ్

ఓ చిన్నమెట్టు భయ పడరాదా

నేను దాడి చేస్తే లేని పోని బాధ

కొంటె తేటు పంటి గాటు కి

లేత పూల తీగె కందిపోదయా

జంట లేని వొంటి వేదిక

చందానాల పూట వుంది రావయ్యా

అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని

నువ్వేంటిలాగా హయ్యో కన్యామణి.. మణి.. మణి...

హే ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

చరణం:2

ఊ నేల రాజా ఈ ముత్యమంతి మత్స్యకాంతి సైగ

నిన్ను రేచగొట్టి వెచ్చా బెట్ట లేదా

హేయ్ వల రాజా ఈ పిల్ల వొళ్లు తల్లడిల్లి పోగా

నువ్వు చెరుకు వేళ్ళు ఎత్తి పెట్టి రాక

చాటు మాట చూపు దేనికి

సొంత మైన సొంపు చూడడానికి

దొంగ లాగా జంకు దేనికి దొర లాగా సోకు లేడదని

అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని

నువ్వేంటిలాగా హయ్యో కన్యామణి.. మణి.. మణి...

హే ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హై

ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేసేయ్ ఇచ్ఛేయ్ మరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి