చిత్రం:చంటబ్బాయి (1986)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
సంగీతం: కె. చక్రవర్తి
పల్లవి :
....ఆ ఆహా హ హ ఆ
ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా
చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా !
ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
చరణం : 1
చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ
పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ
జాణవున్న తావునే జాజిమల్లి తావులు
ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ
వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా !
ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
చరణం : 2
ఈ నిశీధి వీధిలో బాటసారినై ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా ! ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి