Chantabbai లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chantabbai లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2024, బుధవారం

Chantabbai : Atlanti itlanti song lyrics (అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను)

చిత్రం:చంటబ్బాయి (1986)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. పి. శైలజ

సంగీతం: కె. చక్రవర్తి



పల్లవి :

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ చరణం : 1

నార్వేలోని మ్యారిమణుల గుండెల దాగిన ఖైదీని చల్లపిల్లిలో పిల్లిపిల్లలా దొరికిపోయిన ఖైదీవా హాంకాంగులో కింగ్ కాంగ్ నే తలదన్నిన మగధీరుణ్ణీ బందరులోన బల్లిని చూసి బావురుమన్న మగధీరుడివా.. యా.. నా భాషకూ గ్రామర్ హ్యూమర్, నా ఫేసుకూ గ్లామర్ హ్యూమర్ ఇది ఎవరూ నమ్మని రూమర్, ఇక వెయ్యకు నాకీ హేమర్.. నే చార్లీ చాప్లిన్నీ.... అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ చరణం : 2

సిడ్నీ వెళ్ళి కిడ్నీ తీసి దానమిచ్చిన విజేతనూ వడ్లపూడి ఇడ్లీ పోటిలో ఓడిపోయిన విజేతవా మాస్కో డిస్కో ఒలింపిక్సులో కాస్కోమన్న రాజునీ .. మగమహారాజునీ మంగళగిరిలో మహిళామండలి అధ్యక్షతకే అర్హతవున్న మగువరాజువా.. మగమహారాజువా నా కంటికి రెప్పలు కామెడి, నా వొంటికి ఊపిరి కామెడి వనమంతా చెరిచెను తా చెడీ..డి డి డీ.. అది కోతికి చెందిన ట్రాజెడీ...డి డి డీ... నే చార్లీ చాప్లిన్నీ.... అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ

18, మార్చి 2024, సోమవారం

Chantabbai: Nenu Prema Pujari Song Lyrics (నేను ప్రేమ పూజారి)

చిత్రం:చంటబ్బాయి (1986)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

సంగీతం: కె. చక్రవర్తి



నేను ప్రేమ పూజారి ఏది పోదు చేజారి గుండెల్లొ దాచుకున్న గుట్టు లాగె గూడచారి నేను ప్రేమ పూజారి ఏది పోదు చేజారి సీతమ్మె కాజెస్తె చింతాకు పదకము రామచంద్ర ఆ పదకము బట్ట పట్టాల పాలైతి హలో రామచంద్రా... సాక్షి గణపతి లేడు సౌమిత్రి ఊరుకోడు రాగేసిరోమని షురషికామణి ఐతే నిజమైతె నిప్పుకే చెదలంటదా నీటికే నిప్పంటదా హరిలోరంగ హరి వదిలేదు లేదీ సారి క్రిష్న జన్మ స్తానం దాక పోనికమ్మ ముందు దారి హరిలోరంగ హరి వదిలేదు లేదీ సారి సొమ్ములేవె సోమి దేవి నగలు తేవే నంగనాచి సత్య సోదనలో నేను సవ్యసాచినే వీర తాళ్లు తగిలి తగిలి వీపు వాచనే విక్రమర్కుని పట్టు నాది వక్రమార్కము పట్టకే నా పేరు గాణచారి ఇట్టె పట్టెస్తానె చోరి తప్పె నువ్వు ఒప్పుకుంటె తగవే లేదేె నంచారి నా పేరు గాణచారి ఇట్టె పట్టెస్తానె చోరి Twinkle, twinkle, little star How I wonder what you are Up above the jaiki scare Like a diamond in your way నా పేరె మిస్సు మేరి నేను కాను మిస్సు ఏది కస్సు బుస్సు అన్నావంటె కరుసై పోతావె బేబి నా పేరె మిస్సు మేరి నేను కాను మిస్సు ఏది

Chantabbai : Utharana Levandi Druvanakshatram Song Lyrics (ఉత్తరాన లేవంది)

చిత్రం:చంటబ్బాయి (1986)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

సంగీతం: కె. చక్రవర్తి


పల్లవి :

....ఆ ఆహా హ హ

ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా ! ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం

చరణం : 1

చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ జాణవున్న తావునే జాజిమల్లి తావులు ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా ! ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం

చరణం : 2

ఈ నిశీధి వీధిలో బాటసారినై ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా ! ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా !

Chantabbai : Nenu Neekai Puttinanani Song Lyrics (నేను నీకై పుట్టినాననీ)

చిత్రం:చంటబ్బాయి (1986)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

సంగీతం: కె. చక్రవర్తి


పల్లవి :

నేను నీకై పుట్టినాననీ నిన్ను పొందక మట్టికాననీ చెమ్మగిల్లే కనులతో చేయి పట్టే మనసుతో చేసుకున్న బాసలూ ఊసులే ప్రేమ ఊపిరే ప్రేమ... చరణం : 1

నిన్నుచూడక నిదరపోనీ రెండు నేత్రాలు కలల హారతి నీకు పట్టే మౌనమంత్రాలు నిన్నుతాకక నిలవలేని పంచప్రాణాలు కౌగిలింతలా గర్భగుడిలో మూగ దీపాలు ప్రేమ మహిమ తెలుపతరమా ప్రేమే జీవన మధురిమ ॥ చరణం : 2

శ్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే క్రావడ ల్లే నీదు వెలుగులా ప్రమిదనై ఉంటా ఓం అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే నాదమై నిన్నాలపించే ప్రణవమై ఉంటా ప్రేమ మధుమ తెలియ తరమా ప్రేమే జీవన మధురిమ ॥