చిత్రం: సర్కస్ రాముడు (1980)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , యస్.జానకి
సంగీతం: కె.వి.మహదేవన్
పల్లవి: అక్కాచెల్లెలు పక్కన చేరి బావయ్యంటే ఎట్టా సుక్కల మద్దిన సెంద్రుడిమల్లే సిక్కునపడతాపిట్టా అక్కపిట్టి చెల్లిపిట్టి పెద్దపిట్టొ చిన్నపిట్ట చరణం: 1 నాకు ఆకలా ఆగిచావదు. నాకు దప్పికా తీరిచావదు ఇద్దరు కలిసి ముద్దగ చేసి నమిలేస్తుంటే ఎట్టా ముద్దుల మద్దెల దరువులు వేసి నడిపిస్తుంటే ఎట్టా అక్క పిట్టి చెల్లిపిట్టా గిల్లియిట్టా చంపకంటా చరణం: 2 నాకు రేగితే ఆగిచావదు జోడు పడవల స్వారి ఆగదు. ఒక్కదెబ్బకే జంటపిట్టలు ఎపుడో కొట్టిన వాణ్ణి అదే దెబ్బకే చుక్కలు వెయ్యి మొక్కిన భల్ మొనగాణ్ణి అక్కపెట్టా చెలిపిట్టా ఆటపాట కట్టిపెట్టా అక్కా చెల్లెలు పక్కనచేరి బావయ్యంటే ఎట్టా సుక్కల మద్దిన చంద్రుడి మల్లె సిక్కునపడతా పిట్టా అక్క పిట్టా చెల్లిపిట్టా పెద్ద పిట్టా చిన్నపిట్ట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి