4, మార్చి 2024, సోమవారం

Yuvaratna Raana : Maa Kalyana Seethani Song Lyrics మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ)

చిత్రం: యువరత్న రాణా (1998)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



పల్లవి : మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీ జానకమ్మ చెయ్యిపట్టు జాన ఇంక ఎవ్వరంట రఘురాముడే లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే చల్లరో చల్లరో జాజిపూల చందనాలు మల్లె పూబంతుల మంగళాలు మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీ చరణం 1: పుణ్యరేఖ నీవులే పుట్టినింటివారికి తులసికోట నీదిలే మెట్టినింటి పూజకి పేరు నిల్పవమ్మా ప్రేమ కల్పవల్లివై ఇల్లు నిల్పవమ్మా పిల్లపాప తల్లివై కుంకుమ పువ్వుల శోభలతో గుండెను దాటిన ఆశలతో కొంగుపట్టి కోరుకున్న అన్నగారి దీవెన అదే చాలుగా చల్లరో చల్లరో జాజిపూల చందనాలు మల్లె పూబంతుల మంగళాలు మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీ చరణం 2: కృష్ణవేణి వాల్జడ కనకదుర్గ వేయగ గౌతమంత చీరగా కట్టుకోవె సీతగా వెలిగిపోగదమ్మా వెన్నెలింటి జాబిలై మసలుకోగదమ్మా మగని తోడు నీడవై ఊహలకందని సిగ్గులతో ఊయల కోరిన ముగ్గులతో మచ్చలేని చందమామ మేనమామ పోలికై ఒడే చేరగా మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీ జానకమ్మ చెయ్యిపట్టు జాన ఇంక ఎవ్వరంట రఘురాముడే లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి