చిత్రం: దేవత(1982)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి :
చీర కట్టింది సింగారం
చెంప పూసింది మందారం
మేను మెరిసింది బంగారం
అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం
ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం
చీర కట్టింది సింగారం
చెంప పూసింది మందారం
మేను మెరిసింది బంగారం
అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం
ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం
చరణం 1 :
కట్టుకున్న చీరకేమో గీర వచ్చెను
కట్టుకునే వాడినది గిచ్చి పెట్టెను
హొయ్
నిన్ను చూసి వయస్సుకే వయస్సు వచ్చెను
హే
వెన్నెలొచ్చి దాన్ని మరీ రెచ్చగొట్టెను
హొయ్
కన్నె సొగసుల కన్ను సైగలు
ముద్దులు ఇచ్చి నిద్దర లేపి వేదించెను
నిన్ను రమ్మని నన్ను ఇమ్మని
మెలుకువ తెచ్చి పులకలు వచ్చి మెప్పించెను
పొద్దు పొడుపు పువ్వల్లె పువ్వు చుట్టూ తేటల్లే
నిన్ను నన్ను నన్ను నిన్ను ఆడించెను
హా...
చీర కట్టింది సింగారం
చెంప పూసింది మందారం
మేను మెరిసింది బంగారం
అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం
ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం
చరణం 2 :
ఆహ హ... ఆహ హ... ఆహ హ... ఆశలన్నీ అందమైన పందిరాయెను హొయ్ ఆనందం అందుకుని చంద్రుడాయెను హొయ్ కళ్ళు రెండు నీకోసం కాయలాయెను హొయ్ పెళ్లినాటికి అవి మాగి ప్రేమ పండును హొయ్ సన్నజాజులు ఉన్న మోజులు విరిసే రోజు మురిసే రోజు రానున్నది పాలపుంతగా మేను బంతిగా జీవితమంతా సెలయేరంతా కానున్నది నిండు మనసు నావల్లే కొండమీది దివ్వల్లే నీలో నాలో వెలుగే వెలిగే వలపన్నది చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం మేను మెరిసింది బంగారం అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి