Devatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2024, శనివారం

Devatha : Cheera Kattindi Singaram Song Lyrics (చీర కట్టింది సింగారం)

చిత్రం: దేవత(1982)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి :

చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం మేను మెరిసింది బంగారం అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం మేను మెరిసింది బంగారం అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం

చరణం 1 : 

కట్టుకున్న చీరకేమో గీర వచ్చెను కట్టుకునే వాడినది గిచ్చి పెట్టెను హొయ్ నిన్ను చూసి వయస్సుకే వయస్సు వచ్చెను హే వెన్నెలొచ్చి దాన్ని మరీ రెచ్చగొట్టెను హొయ్ కన్నె సొగసుల కన్ను సైగలు ముద్దులు ఇచ్చి నిద్దర లేపి వేదించెను నిన్ను రమ్మని నన్ను ఇమ్మని మెలుకువ తెచ్చి పులకలు వచ్చి మెప్పించెను పొద్దు పొడుపు పువ్వల్లె పువ్వు చుట్టూ తేటల్లే నిన్ను నన్ను నన్ను నిన్ను ఆడించెను హా... చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం మేను మెరిసింది బంగారం అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం

చరణం 2 : 

ఆహ హ... ఆహ హ... ఆహ హ... ఆశలన్నీ అందమైన పందిరాయెను హొయ్ ఆనందం అందుకుని చంద్రుడాయెను హొయ్ కళ్ళు రెండు నీకోసం కాయలాయెను హొయ్ పెళ్లినాటికి అవి మాగి ప్రేమ పండును హొయ్ సన్నజాజులు ఉన్న మోజులు విరిసే రోజు మురిసే రోజు రానున్నది పాలపుంతగా మేను బంతిగా జీవితమంతా సెలయేరంతా కానున్నది నిండు మనసు నావల్లే కొండమీది దివ్వల్లే నీలో నాలో వెలుగే వెలిగే వలపన్నది చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం మేను మెరిసింది బంగారం అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం

Devatha : Velluvachi Godaramma Song Lyrics (ఎల్లువొచ్చి గోదారమ్మ)

చిత్రం: దేవత(1982)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి :

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో...రావయ్యో ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా మీగడంత నీదేలేరా బుల్లోడా(ఎల్లువొచ్చి) కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో...రావమ్మో.. ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు ఆగడాల పిల్లోడైన నీవోడు

చరణం 1 : 

ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు కౌగిళ్ళలో నన్ను చూడు ఆకలికుంటాది కూడు గుండెల్లో చోటుంది చూడు

చరణం 2 : 

నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలి పాట కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు నా మాటకీఏరు తోడు ఏరెండినా ఉరు తోడు నీ తోడులో ఊపిరాడు

22, ఆగస్టు 2021, ఆదివారం

Devatha : Kudi Kannu kotta gane song Lyrics (కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని)

చిత్రం: దేవత(1982)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి




పల్లవి : కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని ఆ రెండు కళ్ళు కొట్టరాదా నన్ను రెచ్చగొట్టి చూడరాదా వంకాయ్.. హొయ్.. హొయ్ కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా ఆ రెండుకళ్ళు కొట్టనేలా ఈ గుండె తలుపు తట్టనేలా వంకాయ్.. హయ్.. హయ్ కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా చరణం 1 : గుమ్మా.. ముద్దుగుమ్మా ముద్దు గుమ్మాలు దాటింది లెమ్మంటా అరె.. అమ్మో.. ఎవడి సొమ్మో దాచుకోకమ్మో.. దోచాలి రమ్మంటా జోరుగా.. నీరునారుగా పచ్చపైరల్లే ఉర్రూతలూగాలంటా ఊగాలా.. తత్తరపడి విచ్చలవిడి ఉయ్యాలా నిద్దరచెడి ముద్దరపడి పొద్దుల గురితప్పాల ముద్దుల ముడి విప్పాల అల్లరిపడి సందేల మల్లెలతో చెప్పాలా వంకాయ్.. హొయ్.. హొయ్ కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా ఆ రెండు కళ్ళు కొట్టరాదా నన్ను రెచ్చగొట్టి చూడరాద చరణం 2 : బుగ్గో.. పూతమొగ్గో.. కొత్తబేరాలు కోరింది రమ్మంట అహ.. సిగ్గో చిలిపి ముగ్గో పట్టపగ్గాలు లేవంది తెమ్మంట జోడుగా ఏరు నీరుగా పల్లెసీమల్లో ఊరేగి పోవాలంట రేగాలా.. బిత్తర చెలి చూపులు సుడి రేగాలా నడిరాతిరి కొన ఊపిరి చక్కలిగిలి కాగాలా దిక్కులు చలికూగాలా చుక్కలు దిగి రావాలా మొక్కుబడులు చెయ్యాలా.. వంకాయ్... హొయ్ హొయ్ కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని ఆ రెండు కళ్ళు కొట్టరాదా నన్ను రెచ్చగొట్టి చూడరాదా వంకాయ్.. హొయ్ హొయ్ హొయ్ కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా ఆ రెండుకళ్ళు కొట్టనేలా ఈ గుండె తలుపు తట్టనేలా