చిత్రం: గద్దలకొండ గణేష్ (2019)
రచన: వనమాలి
గానం: అనురాగ్ కులకర్ణి, శ్వేతా సుబ్రమణియన్
సంగీతం: మిక్కీ జె మేయర్
పల్లవి :
గగన వీధిలో, ఘన నిశిధీలో మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో, మధుర రీతిలో ఎగిసిన పదముల
దివిని వీడుతూ దిగిన వేళలో కళలొలికిన సరసుల
అడుగేసినారు అతిధుల్లా
అది చూసి మురిసే జగమెల్లా
అలలాగ లేచి పడుతున్నారీవేళ
కవిత నీవే
కథవు నీవే
కనులు నీవే
కలలు నీవే
కలిమి నీవే
కరుణ నీవే
కడకు నిను చేరనీయవే
గగన వీధిలో, ఘన నిశిధీలో మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో, మధుర రీతిలో ఎగిసిన పదములా
చరణం 1 :
రమ్మని పిలిచాక
కమ్మనిదిచ్చాక
కిమ్మని అనదింక
నమ్మని మనసింక
కొసరిన కౌగిలింతకా
వయసుకు ఇంత వేడుక
ముగిసిన ఆశకంత గోల చేయక
కవిత నీవే
కథవు నీవే
కనులు నీవే
కలలు నీవే
కలిమి నీవే
కరుణ నీవే
కడకు నిను చేరనీయవే
చరణం 2 :
నడిచిన దారంతా మన అడుగుల రాత చదవదా జగమంతా అది తెలిపే గాథ కలిపిన చేయిచేయిని చెలిమిని చేయనీయని తెలిపిన ఆ పదాల వెంట సాగనీ కవిత నీవే కథవు నీవే కనులు నీవే కలలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చెరనీయవే గగన వీధిలో, ఘన నిశిధీలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో, మధుర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి