27, మార్చి 2024, బుధవారం

Gajaraju : Cheppinaadhey Thana Premani Song Lyrics (చెప్పినాదే తన ప్రేమని)

చిత్రం: గజరాజు (2017)

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: కె. జి.రంజిత్ , శ్రేయా ఘోషల్

సంగీతం: డి. ఇమ్మాన్



పల్లవి:

చెప్పినాదే తన ప్రేమని విని ఆపేదెట్టా గుండెని ఈ మాటను ఎవరు చెప్పగా నే వినలేదులే ఇక ఇంకొక మాటను నా మనసు వినలేదులే తాను చెప్పిన మాటే చాలు ఆ మాటే ఓ పదివేలు, వేలు చెప్పేసానే నా ప్రేమని చెప్పి ఆపేదెట్టా గుండెని ఈ మాటను ఎవరికీ ఇంతవరకు చెప్పలేదులే ఇక ఇంకొక మాటని చెప్పాలనే ఆశ లేదులే నీ ప్రేమే నాకు చాలు నాకదియే ఓ పదివేలు, వేలు

చరణం:1

అమ్మ మాటెన్నెడు విన్లేదులే నాన్న మాటైనను విన్లేదులే నీ మాటే వింటూ ఉన్న నువ్వు నేను జంటే అన్న మనసును విప్పి చెబితే మనకిది లేనిది లోకంలో ప్రేమను మాటే వింటే సంతోషము నిండును హృదయంలో అరేయ్ చెప్పిన మాటే చాలు ఆ మాటే ఓ పదివేలు, వేలు చెప్పేసానే నా ప్రేమని చెప్పినాదే తన ప్రేమని

చరణం:2

ఎన్నెన్నో మాటలు చెప్పాయకే గుండెల్లో ఉండి పోతాయట చెప్పడమే ఎంతో ఇష్టం చెప్పుకుంటే రాదే కష్టం పెదవులు పలికినవే చెదురును అవిమారు నిముషంలో హృదయము పలికినది పోకుండా నిలుచును రక్తంలో అరేయ్ చెప్పిన మాటే చాలు ఆ మాటే ఓ పదివేలు, వేలు చెప్పేసానే నా ప్రేమని చెప్పి ఆపేదెట్టా గుండెని ఈ మాటను ఎవరికీ ఇంతవరకు చెప్పలేదులే ఇక ఇంకొక మాటని చెప్పాలనే ఆశ లేదులే నీ ప్రేమే నాకు చాలు నాకదియే ఓ పదివేలు, వేలు, వేలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి