చిత్రం: గజరాజు (2017)
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: అల్ఫోన్స్ జోసెఫ్
సంగీతం: డి. ఇమ్మాన్
పల్లవి:
నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
ఎప్పటికే తీరే దూరం ఇంకా
నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
ఎప్పటికే తీరే దూరం ఇంకా
నువ్వు తాత్సారం చేయకుండా ఒక మాట చెప్పేయి
ఆ బదులేది లేకుంటే మట్టేసి కప్పేయి
నువ్వేపుడే
నువ్వేపుడే
నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
చరణం:1
అందాల నవ్వేట్టి
ఆకలికి బువ్వెట్టి
అమ్మనే మరిపించి మురిపించావు నిన్న
ఏమైందే నాటి పాశం
నేనెయ్యనలేదే వేషం
నా మీద ఎందుకే పిల్లా రోషం
గుడి కట్టే గుండెల దీపం
ఇది ఇచ్చేనేదో శాపం
ప్రేమేనా చేసిన పాపం, పాపం
నువ్వేపుడే
నువ్వేపుడే
నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
చరణం:2
నెల మీది జాబిల్లి నింగిలోని సిరిమల్లి నా లోకం ఈ బుల్లి అనుకున్నానే నా సొద నీకర్ధం కాదే ఇది ఎవ్వరి తప్పు కాదే మిగిలింది నాకు బాధే, బాధే నీ కోసం ప్రాణం ఇస్తా కడదాకా నీడై వస్తా కాదంటే ఇప్పుడే చస్తా చస్తా నువ్వేపుడే నువ్వేపుడే నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా నువ్వు తాత్సారం చేయకుండా ఒక మాట చెప్పేయి ఆ బదులేది లేకుంటే మట్టేసి కప్పేయి నువ్వేపుడే (నువ్వేపుడే) నువ్వేపుడే (నువ్వేపుడే) నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా