చిత్రం: కంచె (2015)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: అభయ్ జోధ్‌పుర్కర్, శ్రేయా ఘోషల్
సంగీతం: చిరంతన్ భట్
పల్లవి :
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో
సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగం తో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కధానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో
చరణం : 1
ఒక్కొక్క రోజుని ఒక్కక్క ఘడియగ కుదించ వీలవక
చిరాకు పడేటు పరారయిందె సమయం కనపడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెలిపోద
తనోటి ఉందని మనం ఎలాగ గమనించం గనక
కలగంటున్న మెలకువలొ వున్నాం కదా
మనదరికెవరు వస్తారు కదిలించగ
ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీధెలా ఎటుపొతుందో
నిదుర ఎపుడు నిదరొతుందొ మొదలు ఎపుడు మొదలవ్తుందో
ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కధానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో
చరణం : 2
పెదాల మీదుగ అదేమి గలగల పదాల మాదిరి గా సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగ ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ బాష కదా ఫలాన అర్ధం అనేది తెలిపే నిఘంటు వుండదు గా కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ వినబోతున్న సన్నాయి మేళాలుగ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగం తో చెలిమికెలా స్వాగతమందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కధానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి