Kanche లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kanche లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2024, బుధవారం

Kanche : Raa Mundadugeddam Song Lyrics (రా ముందడుగేద్దాం)

చిత్రం: కంచె (2015)

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: విజయ్ ప్రకాష్, కీర్తి సాగతియా

సంగీతం: చిరంతన్ భట్



పల్లవి  :

నీకు తెలియనిదా నేస్తమా చెంత చేరననే పంతమా నువు నేనని విడిగా లేమని ఈ నా శ్వాసని నిను నమ్మిన్చని విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ఉండుంటే అది మనిషిది ఐ ఉంటుందా అడిగావ భుగోలమా నువ్వు చూసావా ఓ కాలమా రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

చరణం : 1

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం రాబందు ల రెక్కల సడి ఏ జీవన వేదం సాదిన్చేదేముంది ఈ వ్యర్ధ విరోధం ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదు అందాం నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

చరణం : 2

అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం నీకు తెలియనిదా నేస్తమా ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం చెంత చేరననే పంతమా ఖండాలుగ విడదీసే జండాలన్ని తలవంచే తలపే అవుదాం ఆ తలపే మన గెలుపని అందాం

Kanche : Itu Itu Ani Video Song Lyrics (ఇటు ఇటు ఇటు అని చిటికెలు)

చిత్రం: కంచె (2015)

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: అభయ్ జోధ్‌పుర్కర్, శ్రేయా ఘోషల్

సంగీతం: చిరంతన్ భట్



పల్లవి  :

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగం తో చెలిమికెలా స్వాగతమందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కధానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో

చరణం : 1

ఒక్కొక్క రోజుని ఒక్కక్క ఘడియగ కుదించ వీలవక చిరాకు పడేటు పరారయిందె సమయం కనపడక ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెలిపోద తనోటి ఉందని మనం ఎలాగ గమనించం గనక కలగంటున్న మెలకువలొ వున్నాం కదా మనదరికెవరు వస్తారు కదిలించగ ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీధెలా ఎటుపొతుందో నిదుర ఎపుడు నిదరొతుందొ మొదలు ఎపుడు మొదలవ్తుందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కధానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో

చరణం : 2

పెదాల మీదుగ అదేమి గలగల పదాల మాదిరి గా సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగ ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ బాష కదా ఫలాన అర్ధం అనేది తెలిపే నిఘంటు వుండదు గా కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ వినబోతున్న సన్నాయి మేళాలుగ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగం తో చెలిమికెలా స్వాగతమందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కధానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో