చిత్రం: కిరాతకుడు (1986)
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి
సంగీతం: ఇళయరాజా
ఒక ముద్దు చాలు ఒక పొద్దు చాలు నాకు ఆ ముద్దు లేక పొద్దెక్కదమ్మ నీకు చూపే దాహం మాటే మైకం నీలో తాపం నాకే సొంతం తీయని నీ నోటి పలుకు ఓ స్వాతి చినుకు కానీ నీ వేడి పిలుపు నా మేలుకొలుపు కానీ చూపే దాహం మాటే మైకం నీలో తాపం నాకే సొంతం తీయని ఒక ముద్దు చాలు...... ఈడే ఈనాడు కోడై కూసె నేనే నీ తీపి తోడే కోరే తడి చూపు ఇచ్చింది తాంబూలము నా పెదవింటి గడపల్లో పేరంటము ముత్యాల వానల్లే వచ్చావులే ఒక పగడాల హరివిల్లు తెచ్చావులే వాగల్లె నీ జోరు రేగాలి ఈ చోట తీరాలి నీతోనే నా ముచ్చట నేడే..... పువ్వై పూసింది నువ్వే నాలో రవ్వై ఎగిసింది నవ్వే నీలో పరువాలు నా పేర రాయించుకో తొలి పన్నీటి స్నానాలు చేయించుకో మురిపాలు సగపాలు పంచేసుకో నీ పొదరింట సరదాలు పండించుకో సందేళలో వచ్చి అందాలు నాకిచ్చి ఎద తట్టి నను నీవు ఆకట్టుకో నేడే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి