చిత్రం: కిరాతకుడు (1986)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా
నన్నీ లోకం రమ్మనలేదు నేనీ జన్మను ఇమ్మనలేదు సరదాగా నే వచ్చేసాను జత కోసం గాలించేసాను అయ్యాను ఖయ్యాం నేను మనిషి మనుగడే పరమ బోర్ మనసుతో ఒకే తగవులు ఎవడు కోరును పరుల మేలు ఎదటి వాడికే నీతులు ఎవడికానందముంది ఎక్కడుంది ఎవడికనుబంధముంది ఎంత ఉంది బ్రతుకులోనే పగులు ఉంది పగులుకేదో అతుకు ఉంది విశ్రాంతి ఉందే ఉంది కళలు లేనిదే కనులు లేవు కరిగి చెదిరినా మరువవు మరువలేనిదే బ్రతుకలేవు గురుతులెన్నడూ మిగలవు మమతలన్నారు ఏవి మచ్చుకేవి మనిషి ఏకాకి జీవి మధుర జీవి సుఖము నిన్నే వెతికి రాదు వెతుకులాట ముగిసిపోదు విశ్రాంతి లేనే లేదు