1, మార్చి 2024, శుక్రవారం

Lorry Driver : Abbanee Pattentha Song Lyrics (అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో)

చిత్రం: లారీ డ్రైవర్ (1990)

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.ఎస్.చిత్ర

సంగీతం: చక్రవర్తి



పల్లవి :

M : చు చు చు చుచూ 

F : హ.. హ అహ..హా !!

M : చు చు చుచుచూ 

F : హా.. హ అహ..హా !!


F : అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో

      దెబ్బతో.. అగ్గిఎంతో పుట్టెనయ్యో

      అమ్మనీ.. చెయ్యెంత చెడ్డదయ్యో

      చల్లగా.. సిగ్గంతా జారెనయ్యా

       పిల్లోడి గోరే  గిల్లిందని

       కిల్లాడి గోలే  ఘోల్లందని అసలే...

       ఆవురావంటూ ఉన్న ఆవిరంత ఆగనీ.


M : అబ్బనీ.. జబ్బెంత పచ్చనమ్మో

        గొప్పగా.. ఇబ్బంది పెట్టెనమ్మో

        అమ్మనీ.. ఒళ్ళెంత వెచ్చనమ్మో

        నొప్పితో.. నాజూకు విచ్చెనమ్మో

        అల్లాడి పోయే గమ్మత్తులో

        ముళ్ళూడిపోయే గల్లంతులో. చలిలో..

        ఎవ్వరెవ్వరంటూ ఉన్న ఆవులింత ఆపనీ.


F : అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో

M : అబ్బనీ .. జబ్బెంత పచ్చనమ్మో


చరణం 1:

F : వణుకురా ..

M : ఆ ..ఆ.. ఆ..

F : అడగదురా ..

M : ఆ..ఆ..

F : చుర్రనీ చూపు ఇవ్వంది కాసేపు ..

    ఒంపుల్లో నిప్పు నింపిపోరా..

M : నిలువునా ..

F : ఆ ఆ ..

M : కలపడనా..

F : ఆ ...ఆ...

M : రమ్మనే రూపు నీ సొంపుల్లో షేపు ..

       సోకమ్మ కేక వినుకోనా..

F : కాలు నిలవని కైపు .. కాలుతున్నది ఆపు

M : రా .... ఆ ..ఆ..

     తడి తడి తపనల తికమక దిగని !!!

F : అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో

M : అబ్బనీ .. జబ్బెంత పచ్చనమ్మో



చరణం 2:

M : కరుకగా ..

F : ఆ ఆ ఆ..

M : కసికరగా ..

F : ఆ ..ఆ ..ఆ

M : కమ్ముకో అంది కోకమ్మ కో అంది

       తెగించి దారి చూసుకోనా..

F : కరుగుగా ..

M : ఆ ఆ ఆ..

F : తొరతొరగా ..

M : ఆ...ఆ..

F : చుట్టుకో అంది జో కొట్టి పో అంది

       జాకెట్టు జట్టు కట్టుకోరా..

M : జాడ . తెలిసిన తాపం ..

       చోటు అడిగెను పాపం

F : రా .. ఆ...

     ఒడుపుగ ఒదగరా ఒంటరి ఒడిని

M : అబ్బనీ.. జబ్బెంత పచ్చనమ్మో..

        గొప్పగా..ఇబ్బంది పెట్టెనమ్మో..

F : పిల్లోడి గోరే గిల్లిందని

      కిల్లాడి గోలే ఘోల్లందని

    అసలే...

    ఆవురావంటూ ఉన్న ఆవిరంత ఆగనీ

M : అబ్బనీ.. జబ్బెంత పచ్చనమ్మో

F : అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి