Lorry Driver లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Lorry Driver లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మార్చి 2024, శుక్రవారం

Lorry Driver : Abbanee Pattentha Song Lyrics (అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో)

చిత్రం: లారీ డ్రైవర్ (1990)

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.ఎస్.చిత్ర

సంగీతం: చక్రవర్తి



పల్లవి :

M : చు చు చు చుచూ 

F : హ.. హ అహ..హా !!

M : చు చు చుచుచూ 

F : హా.. హ అహ..హా !!


F : అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో

      దెబ్బతో.. అగ్గిఎంతో పుట్టెనయ్యో

      అమ్మనీ.. చెయ్యెంత చెడ్డదయ్యో

      చల్లగా.. సిగ్గంతా జారెనయ్యా

       పిల్లోడి గోరే  గిల్లిందని

       కిల్లాడి గోలే  ఘోల్లందని అసలే...

       ఆవురావంటూ ఉన్న ఆవిరంత ఆగనీ.


M : అబ్బనీ.. జబ్బెంత పచ్చనమ్మో

        గొప్పగా.. ఇబ్బంది పెట్టెనమ్మో

        అమ్మనీ.. ఒళ్ళెంత వెచ్చనమ్మో

        నొప్పితో.. నాజూకు విచ్చెనమ్మో

        అల్లాడి పోయే గమ్మత్తులో

        ముళ్ళూడిపోయే గల్లంతులో. చలిలో..

        ఎవ్వరెవ్వరంటూ ఉన్న ఆవులింత ఆపనీ.


F : అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో

M : అబ్బనీ .. జబ్బెంత పచ్చనమ్మో


చరణం 1:

F : వణుకురా ..

M : ఆ ..ఆ.. ఆ..

F : అడగదురా ..

M : ఆ..ఆ..

F : చుర్రనీ చూపు ఇవ్వంది కాసేపు ..

    ఒంపుల్లో నిప్పు నింపిపోరా..

M : నిలువునా ..

F : ఆ ఆ ..

M : కలపడనా..

F : ఆ ...ఆ...

M : రమ్మనే రూపు నీ సొంపుల్లో షేపు ..

       సోకమ్మ కేక వినుకోనా..

F : కాలు నిలవని కైపు .. కాలుతున్నది ఆపు

M : రా .... ఆ ..ఆ..

     తడి తడి తపనల తికమక దిగని !!!

F : అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో

M : అబ్బనీ .. జబ్బెంత పచ్చనమ్మో



చరణం 2:

M : కరుకగా ..

F : ఆ ఆ ఆ..

M : కసికరగా ..

F : ఆ ..ఆ ..ఆ

M : కమ్ముకో అంది కోకమ్మ కో అంది

       తెగించి దారి చూసుకోనా..

F : కరుగుగా ..

M : ఆ ఆ ఆ..

F : తొరతొరగా ..

M : ఆ...ఆ..

F : చుట్టుకో అంది జో కొట్టి పో అంది

       జాకెట్టు జట్టు కట్టుకోరా..

M : జాడ . తెలిసిన తాపం ..

       చోటు అడిగెను పాపం

F : రా .. ఆ...

     ఒడుపుగ ఒదగరా ఒంటరి ఒడిని

M : అబ్బనీ.. జబ్బెంత పచ్చనమ్మో..

        గొప్పగా..ఇబ్బంది పెట్టెనమ్మో..

F : పిల్లోడి గోరే గిల్లిందని

      కిల్లాడి గోలే ఘోల్లందని

    అసలే...

    ఆవురావంటూ ఉన్న ఆవిరంత ఆగనీ

M : అబ్బనీ.. జబ్బెంత పచ్చనమ్మో

F : అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో.

Lorry Driver : Mama Manchamekku Song Lyrics (మావా మంచమెక్కు)

చిత్రం: లారీ డ్రైవర్ (1990)

రచన: జొన్నవిత్తుల

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.ఎస్.చిత్ర

సంగీతం: చక్రవర్తి



పల్లవి :

తధినక తధినక తధినక తధినక మావా మంచమెక్కు చేస్తా కన్నెవిందు మావా మంచమెక్కు చేస్తా కన్నెవిందు అర కోడి కూరొండి ఉంచాను రా కొరమీను పులుసొండి దాచాను రా రుచిగా చెసారా చిల్లి గారెలు రొయ్య వేపుడు భామా కంచం ఎట్టు అన్నీ సర్దిపెట్టు భామా కంచం ఎట్టు అన్నీ సర్దిపెట్టు ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే చిక్కని పాలిచ్చి పక్కేయ్యవే జరదా జయమ్మ చిలకలియ్యవే పడక వెయ్యవే మావా మంచమెక్కు భామా కంచం ఎట్టు


చరణం 1: వేడి వేడి ఉల్లి గారె కొరికి చూడు ఆడదాన్ని గుండె లోతు కొలచి చూడు ఊపు మీద కొత్త ముద్దులిచ్చి చూడు ఉలవ చారు వేడి వేడి చూపుతాడు కుదిరితే ఇలాగే అదురుడే గురుజీ అరే అపేది లేదింక నా తగువు ఏనాడు పెట్టొదు నీ సెలువు మంచమైన కంచమైన ఒక్కటుంట్టే చాలునంట మావా మంచమెక్కు చేస్తా కన్నెవిందు ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే చిక్కని పాలిచ్చి పక్కేయ్యవే జరదా జయమ్మ చిలకలియ్యవే పడక వెయ్యవే మావా మంచమెక్కు భామా కంచం ఎట్టు


చరణం 2: తెల్లకోక సోకులన్ని గిల్లనివ్వు తెల్లవార్లు కాక మీద ఒక్కటవ్వు ముద్దు ముద్దు ఊసులాడి దగ్గరవ్వు ముద్దు గుమ్మ బుగ్గ బూరె పొంగనివ్వు పరువమే వరిస్తే పడకలో గెలుస్తా నన్నెత్తు కోవాలి నీ పోగరు హోరేత్తి పొతాయె నీ హొయలు ఆకులోన ఒక్కపెట్టి ఆగి ఆగి ఇచ్చుకుంట భామా కంచం ఎట్టు అన్నీ సర్దిపెట్టు ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే చిక్కని పాలిచ్చి పక్కేయ్యవే జరదా జయమ్మ చిలకలియ్యవే పడక వెయ్యవే మావా మంచమెక్కు చేస్తా కన్నెవిందు అర కోడి కూరొండి ఉంచాను రా కొరమీను పులుసొండి దాచాను రా రుచిగా చెసారా చిల్లి గారెలు రొయ్య వేపుడు భామా కంచం ఎట్టు మావో మంచమెక్కు

Lorry Driver : Balayya Balayya Song lyrics (బాలయ్య బాలయ్యా)

చిత్రం: లారీ డ్రైవర్ (1990)

రచన: జొన్నవిత్తుల

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,యస్.జానకి

సంగీతం: చక్రవర్తి


పల్లవి :

బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా జోకొట్టాలయా బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా జోకొట్టాలయా ఒడుపుగా వయసుని ఒంగదీయాలి ఒంటిపై వలపునే రంగరించాలి జయమ్మ జయమ్మా సందిస్తే చాలమ్మా సై అంటానులే జయమ్మ జయమ్మా సందిస్తే చాలమ్మా సై అంటానులే తియ్యగా వెయ్యనా వయసు తాంబూలం మెత్తగా తీర్చనా మొదటిమోమాటం

చరణం 1: నట్టు లూజుదానా..... బాలయ్య బాలయ్యా ఫిట్టు చేయరానా..... బాలయ్య బాలయ్యా అదింపట్టుకుని తదోంతత్త యని అంతుచూసెయ్‌నా రింగురోడు మీద..... జయమ్మ జయమ్మా కింగులాగ పోరా.... జయమ్మ జయమ్మా సడన్ బ్రేకులకి ఎయిర్ హారన్‌కి ఛాన్స్ ఇచ్చెయ్‌రా నేను ఇక తయారు రాదు ఇది రిపేరు నిమ్మపళ్ళు లోడుకెత్తి నూరేళ్ళు తోలుకుంట

బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా జోకొట్టాలయా

జయమ్మ జయమ్మా సందిస్తే చాలమ్మా సై అంటానులే

చరణం 2:

కొత్త కొత్త రూటు..... జయమ్మ జయమ్మా మెత్తనైన సీటు..... జయమ్మ జయమ్మా నడుంతిప్పుడుకి జమాయించి నువు దూసుకెళ్ళాలోయ్ తొక్కుతున్న బండి..... బాలయ్య బాలయ్యా మొక్కజొన్న కండి..... బాలయ్య బాలయ్యా చడిచప్పుడుకి పడేనొప్పులకి తట్టుకోవాలి చేసెయ్ ఇక గలాటా రావేనా సపోటా మంచు ముద్దబంతులాట మత్తెక్కుతోందయా

బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా జోకొట్టాలయా బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా జోకొట్టాలయా ఒడుపుగా వయసుని ఒంగదీయాలి ఒంటిపై వలపునే రంగరించాలి జయమ్మ జయమ్మా సందిస్తే చాలమ్మా సై అంటానులే జయమ్మ జయమ్మా సందిస్తే చాలమ్మా సై అంటానులే తియ్యగా వెయ్యనా వయసు తాంబూలం మెత్తగా తీర్చనా మొదటిమోమాటం

30, జులై 2021, శుక్రవారం

Lorry Driver : Jingu Jingu Cheera Song Lyrics (జింగ్ జింగ్ చీర )

చిత్రం: లారీ డ్రైవర్ (1990)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,జానకి



జింగ్ జింగ్ చీర కోణంగి కొంగు జార నువ్వు తొంగి తొంగి చూడ కంగారుగుందిరో కొంగు దొంగ రార ఈ గంగ పొంగు లార బంగారు బెంగ తీర కాపడమందిరో చెంగుమనె చెంగునిలా చేపట్టరో రంగులలో సంగతులే రాబట్టరో రంగేళి రంగాలు చూపెట్టరో రంగు రంగు జాణ నా నంగనాచి మైన నీ హంగు దోచుకొన నా రంగ నాయకి అరె సంబరంగా రాన సంపెంగ సొంపుకూన కంగారు హాయి తేనా చంగావి తాయకి పడుచు ఎదే పొడుపు కథై కవ్వించెరో తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో చింగారి సిగారి చిక్కాలిరోయ్

జింగు జింగు చీర కోణంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో


గళ్ళ కోక చుట్టూ నీ కళ్ళు అల్లుకుంటు గుల్ల గుల్లచేసే ఈ అల్లరేందిరో చిత్త జల్లే పడి చిత్తు కాదా మడి పిల్ల బండారం దండోరా అయిందిరో బుల్లి రెకులల్లే కిల్లాడి సోకులన్నీ వలిచి వలిచి కళ్ళు ఘాటేక్కుతున్నవే ఉడుకు చల్లార్చవా, ముడుపు చెలించవా కన్నె కారంతో మమకారం జోడించవా ఊ కొట్టన జతై జో కొట్టనా ఈ పట్టుతో మతే పోగొట్టనా ఏ గుట్టు లేనట్టు జై కొట్టనా

రంగు రంగు జాణ నా నంగనాచి మైన నీ హంగు దోచుకొన నా రంగ నాయకి జింగ్ జింగ్ చీర కోణంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో

చిక్కు చిక్కు పిల్ల నీ సిగ్గు సంతకెల్ల నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడనా చురుకు పుడుతుందమ్మి ఉలికి పడుతుందమ్మి సరుకు సరదాగా చెలరేగి ఊరేగగా హేయ్ పక్క పక్కకొచ్చి నా పైట గాలి పీల్చి నువ్వు తిక్క పెంచుకుంటే నా తప్పు లేదయ్యో సత్తువంతా చెల్లే మత్తుమందే జల్లి సోకు వాకిట్లో స్పృహ పోతే గొడవెనయ్యో ఓయ్ ... మైకాలలో ఇదేంమాలోకమో అంతే మరీ అదే చెలి గారడీ జన్మంతా ఈ మత్తే ఉంటే సరి

జింగ్ జింగ్ చీర కోణంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో అరె సంబరంగా రాన సంపెంగ సొంపుకూన కంగారు హాయి తేనా చంగావి తాయకి చెంగుమనె చెంగునిలా చేపట్టరో హోయ్ తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో రంగేళి రంగాలు చూపెట్టరో రంగు రంగు జాణ నా నంగనాచి మైన నీ హంగు దోచుకొన నా రంగ నాయకి జింగ్ జింగ్ చీర కోణంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో

Lorry Driver : Dasara Vachindayya Song Lyrics (దసరా వచ్చిందయ్యా)

చిత్రం: లారీ డ్రైవర్ (1990)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,జానకి



దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా జయహో దుర్గాభవానీ… హొయ్ వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్ ఓఓఓ ఓ ఓఓ… రాతిరిలో సూర్యుడిని చూడాలా… ఆ ఆ జాతరతో స్వాగతమే పాడాలా…ఆ ఆ ఈ జోరు పైరు తొక్కలా… చుక్కల్లు చేతుల్లో చిక్కాలా అమ్మోరి దీవెనలు దక్కేలా… ముమ్మారు చెయ్యెత్తి మొక్కలా నింగీ నేలా ఉప్పొంగేలా… సంతోషాలే చిందేయ్యాలా గుళ్ళో దేవుడు సారధి కాగా… లారీ డ్రైవరు ఓనర్ కాడా ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ… ముచ్చటగా ముందుకురా తొందరాగా ఆ ఆ పచ్చదనం పంచుకునే పండుగరా.. ఆ ఆ దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా జయహో దుర్గాభవానీ… హొయ్ వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్ ఓఓఓ ఓ ఓఓ… రాతిరిలో సూర్యుడిని చూడాలా… ఆ ఆ జాతరతో స్వాగతమే పాడాలా…ఆ ఆ వాకిట్ల చీకట్లు తొలిగేలా… చూపుల్లో దీపాలు వెలగాలా దాగున్న దెయ్యాలు దడిసేలా… తెల్లార్లు తిరనాల్లు జరగాల మచ్చే లేని జాబిల్లి నేడు… ఇచ్చిందమ్మా చల్లని తోడు నిన్నా మోన్నటి పేదల పేట… నేడు పున్నమి వెన్నెల తోట ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ… బంజరులో బంగారులే పండేనురో అందరిలో సంబరమే నిండెనురో… దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా జయహో దుర్గాభవానీ… హొయ్ వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్ ఓఓఓ ఓ ఓఓ… రాతిరిలో సూర్యుడిని చూడాలా… ఆ ఆ జాతరతో స్వాగతమే పాడాలా…ఆ ఆ