చిత్రం: మా పెళ్లికి రండి (2001)
రచన:
గానం: ఉన్నికృష్ణన్
సంగీతం: ఎస్. ఎ. రాజకుమార్
మామ, చందమామ, మా మనవే వినవమ్మా మామ, చందమామ, మా మనవే వినవమ్మా భామ, సత్యభామ, నా మనసే కనవమ్మా కార్తీకమాసం కళ్యాణయోగం కమ్ముకు వస్తున్నది కళ్యాణిరాగం కచ్చేరిమేళం పందిల్లు వేస్తున్నవి తుళ్ళి తుళ్ళి వయసే మళ్ళీ మళ్ళీ పిలిచే తుళ్ళి తుళ్ళి వయసే మళ్ళీ మళ్ళీ పిలిచే ఎలా చెప్పనే భామ ఈ తియ్యని తొలిప్రేమ మామ, చందమామ, మా మనవే వినవమ్మా నిన్నే నాలో జూసి, నన్నే నీలో దాచి, నీవులేక నేనులేనని నువ్వే సర్వమని, నాకే సొంతమని, లోకమంత నన్ను చాటానీ చెంపకు చారెడు కళ్ళమ్మా, నా చెంపకమాలే నీవమ్మా చెక్కిన శిల్పం నేనమ్మా, చెలి చెక్కిట చైత్రం నీవమ్మా ఈ ఊహల ఊయల్లో, నీ లాహిరి నేనమ్మా ఆ ఊపిరి ఊసుల్లో, నీదేగా నా జన్మ మామ, చందమామ, మా మనవే వినవమ్మా భామ, సత్యభామ, నా మనసే కనవమ్మా పెళ్ళికళే వచ్చి, పిల్లే భలే నచ్చి, ముత్యమంత ముద్దులివ్వగా అల్లిబిల్లి కాని, గిల్లికజ్జాల్లేని కౌగిలింత కోల చేరగా ఈ బొమ్మని చేసిన ఆ బ్రహ్మ, బహు తుంటరి అయ్యుంటాడమ్మా ఈ కొమ్మన వాలిన పూరెమ్మ, నీ ముంగిట ముగ్గై ఉందమ్మా నీ పాటల పల్లకిలో, ఆ పల్లవి నేనమ్మా నీ తోటలో మల్లియలా, నే రోజూ పూస్తున్నా మామ, చందమామ, మా మనవే వినవమ్మా భామ, సత్యభామ, నా మనసే కనవమ్మా కార్తీకమాసం కళ్యాణయోగం కమ్ముకు వస్తున్నది కళ్యాణిరాగం కచ్చేరిమేళం పందిల్లు వేస్తున్నవి తుళ్ళి తుళ్ళి వయసే మళ్ళీ మళ్ళీ పిలిచే తుళ్ళి తుళ్ళి వయసే మళ్ళీ మళ్ళీ పిలిచే ఎలా చెప్పనే భామ ఈ తియ్యని తొలిప్రేమ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి