7, మార్చి 2024, గురువారం

Bala gopaludu : Okate Thanuvantha song lyrics (ఒకటే తనువంతా)

చిత్రం: బాల గోపాలుడు (1989)

రచన: వేటూరి సుందరరామ రామూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: రాజ్-కోటి



ఒకటే తనువంతా… ఒక వింత తకధింతా ఒడిలో చెలరేగే… సరికొత్త గిలిగింత సందేల పొద్దట్టా చల్లారిపోతే సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగే వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే, ఓ ఓ కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే ఒకటే తనువంతా… ఒక వింత తకధింతా ఒడిలో చెలరేగే… సరికొత్త గిలిగింత నీ చూపు పడ్డనాడే చుక్కలాడే నీ ముగ్గు పచ్చలన్నీ ఎర్రనాయే నీ గాలి సోకగానే సోకులాడే నీ ఒంపుసొంపులన్నీ ఒళ్ళు చేసే ఈ తాకిడి ఒక తారంగము ముద్దాడితే తొలి తాంబూలము హత్తుకుంటే హాయి పుట్టసాగే గుడ్డు పిట్ట కూతే పెట్టసాగే శృంగార వీధుల్లో ఊరేగుతుంటే అందాలు కళ్ళల్లో ఆరేసుకుంటే ఒయ్యారంగా ఒళ్ళోకొస్తాలే,హో ఓ వన్నే చిన్నె మెల్లో… వేస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధింతా ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత నీ కాటుపడ్డ బుగ్గ కందిపోయే నీ చాటు అందమంతా చిందిపోయే నీరెంట పడ్డ నీడ నిన్ను కోరే నీ వెన్నపూస మీద గవ్వలాడే ఈ చీమలే చలి నారింజలై పండించినా తొలి గోరింటలై మత్తుగాలి వీచే మాపటేలా కొత్త ఊపుకొచ్చే రాసలీల సయ్యాట తోటల్లో… సంపెంగ పూసే నీ కంటి పాపల్లో జాబిల్లి కాసే కళ్యాణాలే కల్లోకొస్తుంటే, ఓ ఓ కట్నాలన్నీ ముందే ఇస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధింతా ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత సందేల పొద్దట్టా చల్లారిపోతే సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగే వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే, ఓ ఓ కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా ఒడిలో చెలరేగే సరికొత్త గిలిగింత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి