24, మార్చి 2024, ఆదివారం

Maryada Ramanna : Udhyogam Udipoindi Song Lyrics (ఉద్యోగం ఊడిపోయింది )

చిత్రం: మర్యాద రామన్న (2010)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: రంజిత్

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి  :

ఉద్యోగం ఊడిపోయింది.. పోయిందా...పొ పొ పొ పోయిందా.. సద్యోగం సంతకెళ్ళింది గోవిందా.. గొ గొ గొ గోవిందా.. గోదారి ఈదాలంటే.. కుక్కతోకైనా లేదండీ.. ఏ దేవుడి నడగాలన్నా.. హుండికి చిల్లర లేదు.. పెదవి ఎండిపోతుంది.. కడుపు మండిపోతుంది.. పులుసు కారిపోతుంది.. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.. చరణం : 1

ఎవడండీ బాబూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు..? కృషి ఉంది.. దుర్భిక్షం కూడా ఉంది..!! చెమటోడ్చే మనుషులకి ఏలోటూ రానే రాదంటారు..? ఏమైందీ.. ఆ చెమటేగా మిగిలింది..! ఛీ అంది.. చేతిలో గీత నలిగింది.. నుదిటిపై రాత.. టోటల్ గా చీకటయ్యిందీ లైఫంతా.. పెదవి ఎండిపోయింది.. పులుసు కారిపోతుంది.. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..

చరణం : 2

శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను.. పనిలేదు.. పాకెట్లో పైసాలేదు.. దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను.. ఏం చేయను.. నే ఐరెన్ లెగ్గయ్యాను.. భిచ్చమెత్తరా..! (సిగ్గుపడతాను) జేబు కత్తెర..! (వెయ్యనే లేను) చచ్చిపోమరి.. అంతపని చచ్చినా బాబోయ్ నే చేయలేను... లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది.. తిక్క తీరిపోయింది.. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి