Maryada Ramanna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maryada Ramanna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మార్చి 2024, ఆదివారం

Maryada Ramanna : Raye Raye Saloni Song Lyrics (రాయే రాయే రాయే)

చిత్రం: మర్యాద రామన్న (2010)

రచన: చైతన్య ప్రసాద్

గానం: రఘు కుంచె, గీతా మాధురి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి  :

రాయే రాయే రాయే రాయే రాయే సలోని జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని రాయే రాయే రాయే రాయే రాయే సలోని జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని తెల్లవారినాక చూసి పిల్ల లేదని గోల్లుమంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావని రాయే రాయే రాయే రాయే రాయే సలోని జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని

చరణం : 1

గూటిలోన గుట్టుగా మందిలోన మట్టుగా చేద్దామా గూడుపుఠాణి పగటిపూట దొంగలా మాపటేల కింగ్ లా గో గోడ దూకి నేను నిన్ను చేరి గోకుతుంటే నాచ్ నాచ్ నాచ్ మేరె సాథ్ సాథ్ సాథ్ గిల్లి గిచ్చుకుంటా నాకు నచ్చావే షేక్ షేక్ షేక్ తెరి సోకు సోకు సోకునిలా ముట్టుకుంటే ముడుచుకుంటావే ఏ ఏ ఏ రాయే రాయే రమ్మనంటే రాదు సలోని చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని రాయే రాయే రమ్మనంటే రాదు సలోని చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని

చరణం : 2

రమణ రమణ వెంకట పిల్ల ముదురు టెంకట విదేక్కి వింత గలాటా ఎవడు చూస్తే ఏంటటా ఎగరవేయి బావుటా జిలాని జంప్ తో జనాల తిక్క కుదురుతుంటే నాచ్ నాచ్ నాచ్ మేరీ సాథ్ సాథ్ సాథ్ గిల్లి గిచ్చుకుంటా నాకు నచ్చావే షేక్ షేక్ షేక్ నిల సోకు సోకు సోకునలా ముట్టుకుంటే ముద్దుకొచ్చావే ఏ ఏ ఏ రాయే రాయే రాయే రాయే రాయే సలోని జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని రాయే రాయే రమ్మనంటే రాదు సలోని చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని

Maryada Ramanna : Udhyogam Udipoindi Song Lyrics (ఉద్యోగం ఊడిపోయింది )

చిత్రం: మర్యాద రామన్న (2010)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: రంజిత్

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి  :

ఉద్యోగం ఊడిపోయింది.. పోయిందా...పొ పొ పొ పోయిందా.. సద్యోగం సంతకెళ్ళింది గోవిందా.. గొ గొ గొ గోవిందా.. గోదారి ఈదాలంటే.. కుక్కతోకైనా లేదండీ.. ఏ దేవుడి నడగాలన్నా.. హుండికి చిల్లర లేదు.. పెదవి ఎండిపోతుంది.. కడుపు మండిపోతుంది.. పులుసు కారిపోతుంది.. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.. చరణం : 1

ఎవడండీ బాబూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు..? కృషి ఉంది.. దుర్భిక్షం కూడా ఉంది..!! చెమటోడ్చే మనుషులకి ఏలోటూ రానే రాదంటారు..? ఏమైందీ.. ఆ చెమటేగా మిగిలింది..! ఛీ అంది.. చేతిలో గీత నలిగింది.. నుదిటిపై రాత.. టోటల్ గా చీకటయ్యిందీ లైఫంతా.. పెదవి ఎండిపోయింది.. పులుసు కారిపోతుంది.. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..

చరణం : 2

శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను.. పనిలేదు.. పాకెట్లో పైసాలేదు.. దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను.. ఏం చేయను.. నే ఐరెన్ లెగ్గయ్యాను.. భిచ్చమెత్తరా..! (సిగ్గుపడతాను) జేబు కత్తెర..! (వెయ్యనే లేను) చచ్చిపోమరి.. అంతపని చచ్చినా బాబోయ్ నే చేయలేను... లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది.. తిక్క తీరిపోయింది.. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.

Maryada Ramanna : Yennendlaku Song Lyrics (ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే)

చిత్రం: మర్యాద రామన్న (2010)

రచన:

గానం:

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే… వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ… అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ కోట్లిస్తది కోడిని కోసిస్తే… మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే పోలమ్మకు పొట్టేలును ఏస్తే ఓయ… అమ్మోరికి అవ్వాలని మేత… ఏనాడో రాసేసిన రాత ఎలుగుందా రేతిరి గడిసాక హోయ… అమ్మోరికి అవ్వాలని మేత… ఏనాడో రాసేసిన రాత ఎలుగుందా రేతిరి గడిసాక హోయ… చుట్టూతా కసి కత్తుల కోట… ఏ దారీ కనిపించని సోట కునుకుండదు కంటికి… ఏ పూట ఓయ ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే… వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ… అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ కోట్లిస్తది కోడిని కోసిస్తే… మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే పోలమ్మకు పొట్టేలును ఏస్తే ఓయ… దండాలమ దండాలమ తల్లే… నీ యేటను తెచ్చేసాం తల్లే కోబలి అని… కొట్టేస్తాం తల్లే ఓయ

Maryada Ramanna : Ammyai Kitiki Pakkana Song Lyrics (అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది)

చిత్రం: మర్యాద రామన్న (2010)

రచన: అనంత్ శ్రీరామ్

గానం: కారుణ్య,కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి  :

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది కిటికీలోంచెం కనబడుతుంది గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి ఈ లోకం పరిగెడుతుందండి అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది కిటికీలోంచెం కనబడుతుంది గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి ఈ లోకం పరిగెడుతుందండి చరణం : 1 అక్కడ చూడు తాడి చెట్టుంది ఆకులు ఊపి టాటా చెబుతుంది జాబిలి ఎందుకు వెంటే వస్తుంది నీ పైన మనసై ఉంటుంది పైకి కిందికి ఊగే నేల ఏమంది నువ్వు ఊ అంటేనే ఊయలవుతానంది మీదెకి వచ్చే గాలేమనుకుంటుంది నీ ఉసులు మోయాలంటుందీ ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది గుమ్మంలోంచెం కనబడుతుంది గంటక్కి ఎనభై మైళ్ళ వేగంతోటి ఏవేవో ఆలోచిస్తుంది చరణం : 2 ఊహించని మజిలీ వచ్చింది నాలో ఊహల్ని మలుపులు తిప్పింది ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని ఇట్టేనా ముందర ఉంచింది చల్లని చీకటి చుట్టు కమ్ముకు వస్తుందీ వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగిందీ నిదురలోనె కవ్వించె కల కన్నా నిజమెంతో అందంగా ఉందీ ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది కిటికీలోంచెం కనబడుతుంది గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి కునుకొచ్చి వాలిపోయింది

Maryada Ramanna :Telugammayi Song Lyrics (రాయలసీమ మురిసిపడేలా...)

చిత్రం: మర్యాద రామన్న (2010)

రచన: అనంత్ శ్రీరామ్

గానం: ఎం.ఎం. కీరవాణి, గీతా మాధురి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి  :

రాయలసీమ మురిసిపడేలా... రాగలవాడి జన్మ తరించేలా... ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది మూడు ముళ్ళు వేయమంది తెలుగమ్మాయి... తెలుగమ్మాయి... కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి తెలుగమ్మాయి... తెలుగమ్మాయి... అందుకోమన్నది నిన్ను తన చేయి

చరణం : 1

పలికే పలుకుల్లో ఒలికే తొలకరి ఇంట్లో కురిసిందో సిరులే మరి నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి జంటై కలిసిందో కలతే హరి హంసల నడకల వయారి అయినా ఏడడుగులు నీ వెనకే ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన జాబిలి తునకే.... తెలుగమ్మాయి... తెలుగమ్మాయి... కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి తెలుగమ్మాయి... తెలుగమ్మాయి... అందుకోమన్నది నిన్ను తన చేయి

చరణం : 2

గీతలే అని చిన్న చూపెందుకు వాటి లోతులు చూడలేరెందుకు నదిలో పడవలా వానలో గొడుగులా గువ్వపై గూడులా కంటిపై రెప్పలా జతపడే జన్మకి తోడు ఉంటానని మనసులో మాటనే మనకు చెప్పకనే చెబుతుంది తెలుగమ్మాయి... తెలుగమ్మాయి... గుండెనే కుంచెగా మలచిందోయి తెలుగమ్మాయి... తెలుగమ్మాయి... కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి తెలుగమ్మాయి... తెలుగమ్మాయి... అందుకోమన్నది నిన్ను తన చేయి