5, మార్చి 2024, మంగళవారం

Mayalodu : Chu Manthar Kali Song Lyrics (ఛూమంతర్ కాళీ)

చిత్రం: మాయలోడు (1993 )

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి



పల్లవి:

ఛూమంతర్ కాళీ.. ఇది జంతర్ మంతర్ మోళీ మాయా లేదు మంత్రం లేదు యంత్రం లేదు తంత్రం లేదు మోసం గీసం మొదలే లేదు మస్కాగొట్టే సిట్కాయేదో బైటెట్టేస్తే సరదా పోదూ !! ఢమాడం డోలుగొట్టి మోళిగట్టే ఆట సూడండి తమాసా ఓరుపుట్టే గాలిపాటే ఆలకించండి ఇలాకా ఓలు మొత్తం ఇలాటి సిత్రం యాడాలేదండి సలాకీ సేతివాటం సూడకుండా యెళ్ళిపోకండి అరె ఇందరి ముందర ఇందరజాలం సిందర వందర సిందుల మేళం గలాట గారడి గందరగోళం తెగించి ఆడే తళాంగు తాళం వరేవ్వా యేమి ఛాన్సని తేరగజూసి జారిపోకండి శభాషని తోచినంత ధర్మంజేస్తే ఊరికే పోదండి ఇనామిచ్చే నవాబుంటే సలామంటాం ఇదల్చని బాబుంటే డబుల్ దండాలంటాం !!

చరణం 1: మనిద్దరి మధ్యలో ఏజన్మలో ఏ తీరని రుణముందో మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో ఇటే నీ దారి ఉందని నిన్ను ఏ సుడిగాలి పంపిందో పాపం పుణ్యం దేవుడికెరుక పేదకు దొరికిన బంగరు కణిక పాలూ వెన్నా లేవని అనక ప్రేమను తాగి పెరగవే చిలకా వలేసే పాడులోకం కంటపడక ఉండు నా యెనక ఇలా నా గుండెలోనే గువ్వలా కొలువుండిపో ఇంకా ఇటేపొస్తే యమున్నైనా నిలేస్తానే మరింక ఏ కీడు నీ వంక రాలేదు జాగోరే భేతాళా.. నీ జాదూ సూపెట్టాల కళ్ళకు సుట్టూ గంతలు కట్టు ఐనా అంతా జూస్తున్నట్టు అసలూ నకిలీ కనిపెట్టాల దగాలుజేసే మగానుబాబుల ముసుగూ లొసుగూ పసిగట్టాల

చరణం 2: జనంలో జెంటిల్మన్ లై సెలామణయ్యే సిల్లరనాయాళ్ళు క్షణంలో కళ్ళుమూసి జల్లగొట్టి సల్లగబోతారు మహామహ భేతాళుడికే బేజారెత్తే మాయమరాఠీలు పరాగ్గా ఉన్నారంటే పంగనామం బెట్టిపోతారు అరె డబ్బూ దస్కం జాగర్తండి జగత్కిలాడీలున్నారండి మాకన్నా మా పనోళ్ళులెండి కొమ్ముల్ దిరిగిన కంత్రీల్లెండి మాదంతా పాడు పొట్టకు కూడుబెట్టే పాత విద్యండి దగాలు దారుణాలు సేతకాని కోతులాటండి కులాసాగా ఖూనీసేసే కసాయోళ్ళు దగుల్బాజీగాళ్ళు సుట్టూరా ఉన్నారు.. జాగర్తండి బాబు అమ్మా జాగర్త !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి