Mayalodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mayalodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మార్చి 2024, మంగళవారం

Mayalodu : Chu Manthar Kali Song Lyrics (ఛూమంతర్ కాళీ)

చిత్రం: మాయలోడు (1993 )

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి



పల్లవి:

ఛూమంతర్ కాళీ.. ఇది జంతర్ మంతర్ మోళీ మాయా లేదు మంత్రం లేదు యంత్రం లేదు తంత్రం లేదు మోసం గీసం మొదలే లేదు మస్కాగొట్టే సిట్కాయేదో బైటెట్టేస్తే సరదా పోదూ !! ఢమాడం డోలుగొట్టి మోళిగట్టే ఆట సూడండి తమాసా ఓరుపుట్టే గాలిపాటే ఆలకించండి ఇలాకా ఓలు మొత్తం ఇలాటి సిత్రం యాడాలేదండి సలాకీ సేతివాటం సూడకుండా యెళ్ళిపోకండి అరె ఇందరి ముందర ఇందరజాలం సిందర వందర సిందుల మేళం గలాట గారడి గందరగోళం తెగించి ఆడే తళాంగు తాళం వరేవ్వా యేమి ఛాన్సని తేరగజూసి జారిపోకండి శభాషని తోచినంత ధర్మంజేస్తే ఊరికే పోదండి ఇనామిచ్చే నవాబుంటే సలామంటాం ఇదల్చని బాబుంటే డబుల్ దండాలంటాం !!

చరణం 1: మనిద్దరి మధ్యలో ఏజన్మలో ఏ తీరని రుణముందో మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో ఇటే నీ దారి ఉందని నిన్ను ఏ సుడిగాలి పంపిందో పాపం పుణ్యం దేవుడికెరుక పేదకు దొరికిన బంగరు కణిక పాలూ వెన్నా లేవని అనక ప్రేమను తాగి పెరగవే చిలకా వలేసే పాడులోకం కంటపడక ఉండు నా యెనక ఇలా నా గుండెలోనే గువ్వలా కొలువుండిపో ఇంకా ఇటేపొస్తే యమున్నైనా నిలేస్తానే మరింక ఏ కీడు నీ వంక రాలేదు జాగోరే భేతాళా.. నీ జాదూ సూపెట్టాల కళ్ళకు సుట్టూ గంతలు కట్టు ఐనా అంతా జూస్తున్నట్టు అసలూ నకిలీ కనిపెట్టాల దగాలుజేసే మగానుబాబుల ముసుగూ లొసుగూ పసిగట్టాల

చరణం 2: జనంలో జెంటిల్మన్ లై సెలామణయ్యే సిల్లరనాయాళ్ళు క్షణంలో కళ్ళుమూసి జల్లగొట్టి సల్లగబోతారు మహామహ భేతాళుడికే బేజారెత్తే మాయమరాఠీలు పరాగ్గా ఉన్నారంటే పంగనామం బెట్టిపోతారు అరె డబ్బూ దస్కం జాగర్తండి జగత్కిలాడీలున్నారండి మాకన్నా మా పనోళ్ళులెండి కొమ్ముల్ దిరిగిన కంత్రీల్లెండి మాదంతా పాడు పొట్టకు కూడుబెట్టే పాత విద్యండి దగాలు దారుణాలు సేతకాని కోతులాటండి కులాసాగా ఖూనీసేసే కసాయోళ్ళు దగుల్బాజీగాళ్ళు సుట్టూరా ఉన్నారు.. జాగర్తండి బాబు అమ్మా జాగర్త !!

Mayalodu : Chalaki Chilipi Song Lyrics (చలాకి చిలిపి వయసులో)

చిత్రం: మాయలోడు (1993 )

సాహిత్యం: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి




చలాకి చిలిపి వయసులో ఓ హొయ్ అదేమీ వింత వున్నదో ఓ హొయ్ చలాకి చిలిపి వయసులో ఓ హొయ్ అదేమీ వింత వున్నదో ఓ హొయ్ చలాకి చిలిపి వయసులో అదేమీ వింత వున్నదో సుఖాల వీణ మీటమన్నది చలాకి చిలిపి వయసులో ఓ హొయ్ అదేమీ వింత వున్నదో ఓ హొయ్ కనులు కనులు కలుసుకున్న వేళలో ఎన్నెన్ని ఊహలో ఎన్నని పులకరింతలో తనువు తనువు తడుముతున్న జోరులో హుషారు హోరులో ఎన్నెన్ని జలదరింపులో పెదవి మధువులొలికే నెందుకో….. హొయ్ పడుచు వయసు నడిగి తెలుసుకో…. హొయ్ వరాల కౌగిలింతలోని వింత ఇంతలా చలాకి చిలిపి వయసులో ఓ హొయ్ అదేమీ వింత వున్నదో ఓ హొయ్ రేయి కురులు విప్పుకుంది రమ్మని అదేదో ఇమ్మని అదేమో నీకే తెలుసనీ ఆశ తలుపు తెరుచుకుంది జుమ్మని ఊపందుకొమ్మని ఉయ్యాల ఊగిపొమ్మని సొగసు అలసిపోయేనెందుకో.. హొయ్ హొయ్ పసిడి పరుపు నడిగి తెలుసుకో.. హొయ్ మాజాల ముగ్గులోకి దించి నన్ను పంచుకో చలాకి చిలిపి వయసులో ఓ హొయ్ అదేమీ వింత వున్నదో ఓ హొయ్ చలాకి చిలిపి వయసులో అదేమీ వింత వున్నదో సుఖాల వీణ మీటమన్నది హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్ ఆహ… లలలలలల….. హ..హహహ


Mayalodu : Nee Mayalo Dini Song Lyrics (నీ మాయలోడిని నేనే)

చిత్రం: మాయలోడు (1993 )

సాహిత్యం: గాడూరి విశ్వనాథ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి



చెమ్మ చెక్క చుక్క చిక్కగ చిక్కులేసేనా చారడేసి మొగ్గ బుగ్గ సిగ్గు పూసేనా ఓహో ఓహో… ఒహ్హో హో ఓహో ఓహో… హోహో హో ఓహో ఓహో… ఒహ్హో హో ఓహో ఓహో… హోహో హో నీ మాయలోడిని నేనే…. నీ మాయలేడిని నీనే నీ మాయలోడిని నేనే…. నీ మాయలేడిని నీనే వయసు గారడీ… మనసు పేరడీ ప్రేమంటే అంతులేని మాయా హే, నీ మాయలోడిని నేనే… ఓ హో హో హోయ్ ఓహో ఓహో… ఒహ్హో హో ఓహో ఓహో… హోహో హో ఓహో ఓహో… ఒహ్హో హో ఓహో ఓహో… హోహో హో సరిసగ సగమ పమగసా రిసగమ పనిపని ప మపమప మ గమగస చెమ్మ చెక్క చుక్క చిక్కగ చిక్కులేసేనా చారడేసి మొగ్గ బుగ్గల సిగ్గు పూసేనా ఈ దూరమెలా భారమేల… గాలివాటు గారమేల రా రా నీ ఓరచూపు గాలమేల… చేతగాని బేరమేల పోవే సంబరంగా సాధించనా… ఠింగురంగా వేధించకే ముగ్గులోకి దింపుతాను… స్వర్గలోకం చూపుతాను రా రా… ఓ నా వీర హ్మ్ నీ మాయలోడిని నేనే…. నీ మాయలేడిని నీనే ఓఓ ఓ ఓ ఓఓ ఓ.. ఎలేలో ఏలేలమ్మ… పున్నాగ పూలకొమ్మ సన్నంగా సైగ చేసెనా తీగంటి నడుము దాన్ని… తూనీగ నడక దాన్ని సరసానికొచ్చిపోనా ఈ దొంగచాటు ప్రేమ ఏలా… ప్రేమ మాటు వైరమేల భామా నా అందమంత పంచుతాను… గంగలోన ముంచుతాను మామా నేటి మోజులు నేనెరుగనా… నాటి మోహిని నేనవ్వనా చిందులేసే జింకపిల్లా… ఈల వేస్తే గుండె గుల్ల, మాయాజాలం చూడు హో, నీ మాయలోడిని నేనే…. నీ మాయలేడిని నీనే వయసు గారడీ… మనసు పేరడీ ప్రేమంటే అంతులేని మాయా, ఆ ఆ ఆ

1, ఆగస్టు 2021, ఆదివారం

Mayalodu : Chinuku Chinuku Andelatho Song Lyrics (చినుకు చినుకు అందెలతో)

చిత్రం: మాయలోడు (1993 )

సాహిత్యం: జొన్నవిత్తుల

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి




చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే బిగి కౌగిలి పొదరింటికి పద పదమంటే ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసే ఏలో పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వల వేయగా సెలయేరై పెనవేసింది చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో వలపు ఇక తొలివలపు తక జం తక జం వయసు తడి సొగసు అరవిరిసే సమయం ఆహా . ఊహూ ... చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎద లోపల చలిగాలుల సుడి రేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసోచ్చే ఏలో మేను చూపు పోయింది వాలు చూపు సయ్యంది చలి కోరిక అలవోకగ తల ఊపింది సరసాల సిందులోన ఏలో సరిగంగ తానాలు ఏలో ఒడిలో ఇక ఒకటై తకతకతై అంటే సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే... ఆహా . ఊహూ ...