29, మార్చి 2024, శుక్రవారం

Muddula Mavayya : Hey Raja Vilasam Naadi Song Lyrics (హే రాజా విలాసం నాది)

చిత్రం : ముద్దుల మావయ్య (1989)

సంగీతం : కె. వి. మహదేవన్

గీతరచయిత : వెన్నెలకంటి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :

హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది రాగాల జోరులో ఊగాలిరా మేఘాల తేరులో సాగాలిరా ఈ వేళా, ఆ ఆ ఏ ఏ ఓఓ హో ఓ హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది

చరణం : 1

హే హే హే హేహే హే హో హో హోహో హో వేడి గుండె మా కోక వాడిపోని విరి తోట పడుచు వయసుదీ పాట గడుసుదనపు సయ్యాట మల్లె వంటి విరిజల్లు వంటి అది విల్లు వంటి వాళ్ళం ఎల్లలేలికలు వెల్లువంటి మనసున్న అల్లరోళ్ళం ఈ వేళా, ఆ ఆ ఏ ఏ రురు తరర రీబా హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది

చరణం : 2

హెయ్ నగలు దోచునొక దొంగ వగలు దోచునొక దొంగ దేవుడే మొదటి దొంగ చూడరా సామి రంగా కళ్ళు గప్పి ఆ గొల్ల ఇల్లు తను కొల్లగొట్టలేదా, హ హహ వీలు చూసుకొని పాలతోటి మురిపాలు దోచలేదా ఈ వేళా, ఆ ఆ ఏ ఏ రురు రర దే వా వ్ హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది రాగాల జోరులో ఊగాలిరా మేఘాల తేరులో సాగాలిరా ఈ వేళా, ఆ ఆ ఏ ఏ ఓఓ హో ఓ హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది రపప పా యా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి