Muddula Mavayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Muddula Mavayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2024, శుక్రవారం

Muddula Mavayya : Mavayya Anna pilupu Song Lyrics (మావయ్య అన్న పిలుపు)

చిత్రం : ముద్దుల మావయ్య (1989)

సంగీతం : కె. వి. మహదేవన్

గీతరచయిత : వెన్నెలకంటి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. పి. శైలజ, పి. సుశీల



పల్లవి: చేలో మావిళ్ళు కోరి పిల్ల వేవిళ్ళ కొచ్చె ఒళ్ళో చలివిళ్ళు పెట్టరే ఎయ్... తాన తందాననాన తాన తందాననాన తాన తందాననాన నా... మల్లె పందిళ్ళు వేసి తల్లో జాజులు పెట్టి కొత్త గాజులు వెయ్యవే తాన తందాననాన తాన తందాననాన తాన తందాననాన తా... ఆ.. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడనా చంటిపాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు తందనతందానా తందనతందానా తందనతందానా తందనతందానా తందనతందానా తందనతందానా తందనతందానా తందనతందాన... చరణం 1: అరచేత పెంచాను చెల్లిని ఈ అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవా నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా అమ్మగా లాలించాడు నిన్ను నాన్నగా పాలించాడు అన్నగా ప్రేమించాడు అన్నీ తానైనాడు తన ప్రాణంగా నను పెంచాడు ఆ దైవంగా దీవించాడు నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఊ... ఊ... ఊ... మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఊ... ఊ... ఊ... చరణం 2: పట్టు చీరకట్టి సారెపెట్టారే దిష్టిచుక్క పెట్టి హారతి ఇవ్వరే అందాల కొమ్మా నీళ్ళాడునమ్మా అక్షింతలేసీ దీవించరమ్మా ఆరేడు మాసాలు నిండగా ఈ అన్నయ్య కలలన్నీ పండగా తేవాలి బంగారు ఊయల కావాలి మా ఇల్లు కోవెల రెప్పగా నిను కాచనా పాపగా నిను చూడనా రేపటి ఆశ తీరగా ఈ పాపకు జోల పాడనా ఇది అరుదైన ఓ అన్న కథ ఇది మురిపాల ఓ చెల్లి కథ ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడనా చంటిపాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఊ... ఊ... ఊ... మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఊ... ఊ... ఊ...


Muddula Mavayya : Aaku Chatuna Pindhe Tadisenoyi Mama Song Lyrics (ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ)

చిత్రం : ముద్దుల మావయ్య (1989)

సంగీతం : కె. వి. మహదేవన్

గీతరచయిత : సి..నారాయణ రెడ్డి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



పల్లవి: ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ మారాకు వేసి మారాలు చేసె గారాలు చూడు మామ నేరాలు చెయ్యి మామ హోయ్ మామ... మామ... మామ... మామ... మామ... మామ... ఆకు చాటున పిందె తడిసెనా భామ మారాకులోన మారాలు చేసి గారాలు దోచుకోనా నేరాలు చేసుకోనా భామ... భామ... భామ... మామ... మామ... మామ... చరణం 1: పందిరి నువ్వై తీగల్లే అల్లుకుపోనీ అందాలూరే నీ పాటకు పల్లవి కానీ వేసిందమ్మా జాబిల్లి వెన్నెల ఓణి నవ్విందమ్మా నడకల్లో కిన్నెరసాని అండదండ నువ్వే నాకింక కైదండలేక ఉండలేను రారా నా వంక కొండమల్లి పువ్వే నువ్వంట నా గుండెలోన ఉండిపోతె అంతే చాలంట ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ మారాకు వేసి మారాలు చేసె గారాలు చూడు మామ నేరాలు చెయ్యి మామ హోయ్ మామ... మామ... మామ... హోయ్ భామ... భామ... భామ... చరణం 2: తళుకుల పుట్ట వచ్చింది తపనల పుట్ట కులుకుల పిట్ట నచ్చింది వదిలేదెట్టా అక్కరకొచ్చె అందాల చక్కని చుక్క చక్కెర ముద్దే ఇచ్చింది చెక్కిలినొక్క హోయ్ పట్టరాని పాలపిట్టరో పండంటి ఈడు ముట్టబోతే ముద్దు పుట్టెరో పుట్టతేనె పట్టు పెదవిరో ఓ చిట్టి ముద్దు పెట్టకుంటే ఆగేదెట్టారో అరె ఆకు చాటున పిందె తడిసెనా భామ మారాకులోన మారాలు చేసి గారాలు దోచుకోనా నేరాలు చేసుకోనా భామ... భామ... భామ... మామ... మామ... మామ... హోయ్ భామ... భామ... భామ...

Muddula Mavayya : Hey Raja Vilasam Naadi Song Lyrics (హే రాజా విలాసం నాది)

చిత్రం : ముద్దుల మావయ్య (1989)

సంగీతం : కె. వి. మహదేవన్

గీతరచయిత : వెన్నెలకంటి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :

హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది రాగాల జోరులో ఊగాలిరా మేఘాల తేరులో సాగాలిరా ఈ వేళా, ఆ ఆ ఏ ఏ ఓఓ హో ఓ హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది

చరణం : 1

హే హే హే హేహే హే హో హో హోహో హో వేడి గుండె మా కోక వాడిపోని విరి తోట పడుచు వయసుదీ పాట గడుసుదనపు సయ్యాట మల్లె వంటి విరిజల్లు వంటి అది విల్లు వంటి వాళ్ళం ఎల్లలేలికలు వెల్లువంటి మనసున్న అల్లరోళ్ళం ఈ వేళా, ఆ ఆ ఏ ఏ రురు తరర రీబా హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది

చరణం : 2

హెయ్ నగలు దోచునొక దొంగ వగలు దోచునొక దొంగ దేవుడే మొదటి దొంగ చూడరా సామి రంగా కళ్ళు గప్పి ఆ గొల్ల ఇల్లు తను కొల్లగొట్టలేదా, హ హహ వీలు చూసుకొని పాలతోటి మురిపాలు దోచలేదా ఈ వేళా, ఆ ఆ ఏ ఏ రురు రర దే వా వ్ హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది రాగాల జోరులో ఊగాలిరా మేఘాల తేరులో సాగాలిరా ఈ వేళా, ఆ ఆ ఏ ఏ ఓఓ హో ఓ హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా మాది రపప పా యా