చిత్రం: నీడ లేని ఆడది (1974)
రచన: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
పల్లవి :
తొలి వలపే.. తొలి వలపే
తియ్యనిదీ.. తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
నీ కొరకే దాచినదీ వేరెవరూ దోచనిదీ
తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
చరణం : 1
పొగరూ సొగసూ గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
పొగరూ.. సొగసూ.. గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
ఈ విసురూ ఎక్కడిదీ
నీ జతలోనే నేర్చినదీ
తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
చరణం : 2
కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కలకాలం ఈ ప్రణయం
నిలవాలీ మనకోసం
తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిదీ
చరణం : 3
వలచే హృదయం విలువైనది కలిసే బంధం విడిపోనిదీ అనురాగం కొనలేనిదీ అది ఒకటే మన పెన్నిధీ తొలివలపే తియ్యనిదీ మదిలో ఎన్నడు మాయనిదీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి