31, మార్చి 2024, ఆదివారం

Number One : Changu Bhala Song Lyrics (ఛాంగు భళా బాగుంది)

చిత్రం : నెంబర్ వన్ (1994 )

సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




పల్లవి:

ఛాంగు భళా బాగుంది కదా తమ జోరు చెంగుమని చెంగు చెంగుమని జత చేరు ఇది ఇన్నాళ్లు ఎరుగని తాకిడి ఎదురయ్యింది తొలకరి సందడి జోడు కమ్మంది వింత ఈడు ఈడు ఇమ్మంది వంత పాడు అబ్బబ్బ ఓయబ్బ చెప్పొద్దులే ఛాంగు భళా బాగుంది కదా తమ జోరు చెంగుమని చెంగు చెంగుమని జత చేరు చరణం:1

ఆ.....ఆ..... కంటి కొనలు ఎరుపెక్కగా కనుగొంటి నిన్ను తగు జంటగా ఓ.....ఓ..... జుంటి తేనె తొణికించగా మునిపంటి పదును పెదవంటగా నులివెచ్చగా చలి రెచ్చగా అబ్బబ్బ ఓయబ్బ చెప్పొద్దులే ఛాంగు భళా బాగుంది కదా తమ జోరు చెంగుమని చెంగు చెంగుమని జత చేరు చరణం:2

ఓ.....ఓ..... కోడె యవ్వనము సాక్షిగా శత కోటి కోరికలు తీర్చనా ఓ.....ఓ..... కొంటె మన్మథుని కాంక్షగా జతనంటి తన్మయము పెంచనా దరిచేరనా దరిచేర్చనా అబ్బబ్బ ఓయబ్బ చెప్పొద్దులే ఛాంగు భళా బాగుంది కదా తమ జోరు చెంగుమని చెంగు చెంగుమని జత చేరు ఇది ఇన్నాళ్లు ఎరుగని తాకిడి ఎదురయ్యింది తొలకరి సందడి జోడు కమ్మంది వింత ఈడు ఈడు ఇమ్మంది వంత పాడు అబ్బబ్బ ఓయబ్బ హూహూహుహు ఛాంగు భళా బాగుంది కదా తమ జోరు చెంగుమని చెంగు చెంగుమని ️జత చేరు(2)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి