చిత్రం : నెంబర్ వన్ (1994 )
సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి
రచయిత : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి:
అందమైనది ముందర ఉంది
అందుకే యమ తొందరగుంది
రంభ మరదలు రంజుగ ఉంది
సంబరానికి సయ్యని అంది
పాలపొంగుకి ఆశగ ఉంది
పైటకొంగుకి కోరిక ఉంది
పూతరేకుల కానుక ఉంది
ఆరగింపుకి రమ్మని అంది
చరణం:1
అడిగిందీ రాచిలకా అలకలు తీర్చు రసగుళికా తగిలిందా చెలి చురకా సరిగమపా సరసమిక అరె మొదలెడితే తెరవనక మెరుపులమేను తకిటతక విరబూసే వయసు ఇక నిలవదుపా నువు లేక అరె మోజైతే సయ్యంటు రాక మొహమాటమేలా ఇక ఊరంతా గగ్గోలు గాక చూడాలి నువ్వే ఇక గుండెలో ఏ బెంగలేక గుట్టుగా రావే ఇక జోరుగా నూరేళ్ళదాకా ఎగరేయి జెండా ఇక
అందమైనది ముందర ఉంది అందుకే యమ తొందరగుంది
పూతరేకుల కానుక ఉంది ఆరగింపుకి రమ్మని అంది
చరణం:2 తపనలలో తలమునక చలిచలివేళ చమకుచక పొదవెనుక పరువమిక పదనిసలే పలుకునిక ఆ చురుకుమనే చూపులకి శృతిమించేను సోకు ఇక ముదిరినదా మురిపమిక మొదలుకదా మోత ఇక నువ్వంటే పడిచస్తా మామా నీకే నా సోకిస్తా రా నీకోసం దిగి వచ్చా భామా వలపిస్తా వడిపట్టవే గుండెల్లో కోయిళ్ళ కూత తీయనా నీ కౌగిట బుగ్గలో దానిమ్మపూత ఓలమ్మీ ఈ సందిట
అందమైనది ముందర ఉంది అందుకే యమ తొందరగుంది రంభ మరదలు రంజుగ ఉంది సంబరానికి సయ్యని అంది పాలపొంగుకి ఆశగ ఉంది పైటకొంగుకి కోరిక ఉంది పూతరేకుల కానుక ఉంది ఆరగింపుకి రమ్మని అంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి