చిత్రం: రాంబంటు (1996)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
అల్లరెందుకు రారా నల్ల గోపాలా చిందులాపర సామి చిన్ని గోవిందా(2) అమ్మ కడుపే చల్లగా మా అమ్మ వలపే వెన్నగా రవ్వ సేయక తానమాడరా మువ్వ గోపాలా నలుగు పెట్టె వేళ అలకల్లు ముద్దు చమురు పెట్టె చేయి దరువుల్లు ముద్దు నలుగెట్టిన పిండి నాకు గణపతిగా ముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగా తల అంటు పోసేటి రాంబంటు పాట కలగంటూ పాడాల కలవారి ఇంట రాలచ్చి ఇచ్చింది ఈ రాచ పుటక సీలచ్చి దోచింది నీ చేతి ఎముక మీ ఉప్పు తిని అప్పు పడ్డాను గనక తీర్చలేని ఋణము తీర్చుకోమనక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి