చిత్రం: రాంబంటు (1996)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి:
అ అ హే హే లలాల లలాల అహ అహ లలాల అహ అహ
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు
అరిటిపువ్వు తెస్తాడు అడవిపురుషుడు
లలాల లలాల
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
చరణం:1
భద్రాద్రి రామన్న పెళ్లికొడుకవ్వాల సీతలాంటి నిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గ బాసికాలు తేవాల బాసరలో సరస్వతి పసుపూకుంకుమలివ్వాల
విన్నపాలు వినమంటే విసుగంటాడు మురిపాల విందంటే ముసుగేడతాడు
విన్నపాలు వినమంటే విసుగంటాడు మురిపాల విందంటే ముసుగేడతాడు
బుగ్గపండు కోరకడు పక్కపాలు అడగడు పలకడు ఉలకడు పంచదార చిలకడు
కౌగిలింతలిమ్మంటే కరుణించడు ఆవులింతలంటాడు అవకతవకడు
అహ అహ
లలాల లలాల
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
చరణం:2
ఏడుకొండలసామి ఏల్లలు చదవాల చేవిటి మల్లన్న సన్నాయి ఊదాల
అన్నవరం సత్యన్న అన్నవరాలు ఇవ్వాల. సిమాద్రి అప్పన్న సిరి చేష్టలు ఇవ్వాల
పెదవి తెనేలందిస్తే పెడమోములు తెల్లరిపోతున్నా చెలి నోములు
పెదవి తెనేలందిస్తే పెడమోములు తెల్లరిపోతున్నా చెలి నోములు
పిల్లసిగ్గు చచ్చిన మల్లెమొగ్గ విచ్చిన కదలడు మెదలడు కలికి పురుషుడు
అందమంతా నీదంటే అవతారుడు అదిరదిరి పడతాడు ముదురుబెండదు
లలాల లలాల