27, మార్చి 2024, బుధవారం

Ranam : Nallanimabbu Song Lyrics (నల్లని మబ్బు)

చిత్రం: రణం (2006)

సాహిత్యం: భాష శ్రీ

గానం: వర్ధిని

సంగీతం: మణి శర్మ



పల్లవి:

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిల కిల నవ్వి ఈలే వేస్తవేమలా సరేలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందేవెస్తవేంటలా తెలుసా జడివాన తొలి చినుకై నువ్వు తాకేయగా తడిసె నెరజాణ సిరి నెమలై కురి విప్పేయగా ఘల్లు ఘల్లుమని అందెలు ఆడేనులే అరే ఝల్లు ఝల్లుమని చినుకే రాలేనులే జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే తాను ఏడు రంగుల విల్లై ఊగెనులే

చరణం:1

ఎంత ధైర్యమే వాన మా ఇంటికొచ్చి నా పైన చిటుకు చిటుకు అని జారీ చల్లని చినుకై ఎద చేరి సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను చూసే వెలుగైనా చూడని ఒంపుల్లో తనువార జలకమే ఆడే చనువిస్తే తుంటరి వాన తొలి ప్రాయం దోచడమేనా సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిల కిల నవ్వి ఈలే వేస్తవేమలా

చరణం:2

వింత చేసేనీ వాన కురిసింది కొంత సేపైనా తడిపి తడిపి నిలువెల్లా తపనై వెలిసి హరివిల్ల చిరు జల్లు వలచిన ప్రాయాలే మరుమల్లె తీగకారిస్తే సెలయేటి అద్దమును చూపించి మేరుపల్లె మేనిలో చేరి చనువిస్తే తుంటరి వాన తొలి ప్రాయం దోచడమేనా సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా ఘల్లు ఘల్లుమని అందెలు ఆడేనులే అరె ఝల్లు ఝల్లుమని చినుకే రాలేనులే జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే తాను ఏడు రంగుల విల్లై ఊగెనులే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి