చిత్రం : సంబరం (2003)
సంగీతం : ఆర్. పి. పట్నాయక్
రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఆర్. పి. పట్నాయక్
పల్లవి:
ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా కన్నీటిని కురిపించాలా ఙ్ఞాపకమై రగిలించాలా మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
చరణం : 1
తప్పదని నిను తప్పుకొని వెతకాలి కొత్తదారి నిప్పులతో మది నింపుకుని బ్రతకాలి బాటసారి జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా ఒంటిగా నను ఎన్నడు వదిలుండనందిగా నువ్వూ నీ చిరునవ్వు చేరని చోటే కావాలి ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
చరణం : 2
ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక జన్మలో నువ్వు లేవని ఇకనైన నన్ను నమ్మని నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేను వెలివేసుకొని దూరం అవుతున్నా ఎందుకే ఇలా గుండె లోపలా ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి