Sambaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sambaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2024, ఆదివారం

Sambaram : Madhuram Madhuram Song Lyrics (మధురం మధురం)

చిత్రం : సంబరం (2003)

సంగీతం : ఆర్. పి. పట్నాయక్

రచయిత : కులశేఖర్

గానం : రాజేష్ కృష్ణన్



పల్లవి:

మధురం మధురం ఎపుడూ ప్రేమ సహజం సహజం ఇలలో ప్రేమ కలలసీమలో నిజము ఈ ప్రేమ అనురాగం పలికించే ప్రియనేస్తం ప్రేమ ప్రేమ...

చరణం : 1

ఎపుడూ ఎదకీ ఒకటే ధ్యాస ఎపుడోఅపుడూ నాదను ఆశ బదులు కోసమే ఎదురు చూస్తున్నా మదిలోనే కొలువున్నా నిను చూసీ పలుకే రాదే...

చరణం : 2

వలపూ విషమూ ఒకటేనేమో మనసూ మమతా కలలేనేమో చిగురుటాశలే చెదిరిపోయేనే ఎదకోసే ఈ బాధా మిగిలిందీ ప్రేమ ప్రేమ....

Sambaram : Devudichina Song Lyrics (దేవుడిచ్చిన వరమని తెలిసే)

చిత్రం : సంబరం (2003)

సంగీతం : ఆర్. పి. పట్నాయక్

రచయిత : కులశేఖర్

గానం : టిప్పు



పల్లవి:

దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే అలవాటు లేని ఈ పులకింత తన రూపమే గదా మనసంతా ఇది ప్రేమ కాక మరి ఏంటంటా No doubt no doubt no doubt no ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ

చరణం : 1

ప్రాణమున్నది మనసు తను లేని జీవితం బొరుసు పుస్తకాలలో దాచుకున్న నా జ్ఞాపకాలనే అడుగు ఆమె పేరునే మనసు అరె మాటిమాటికీ తలుచు ఆమెకోసమై ఎంత వేచినా చెంత చేరదే అలుపు అనురాగమే ఒక మేఘమై తొలిప్రేమగా కురిసింది అని తనలో తనే మనసే ఇలా మురిసిందిలే దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే

చరణం : 2

ఆమె కళ్ళలో మెరుపు అరె ఆమె నవ్వు మైమరుపు ఆమె ఊహలో ఆమె ధ్యాసలో తేలితున్నది మనసు ఆమెకోసమీ బ్రతుకు మది ఆమెకోసమే బతుకు ఇన్ని రోజులు చిన్ని మనసెలా కలవరించెనో అడుగు తన ప్రేమలో నిజముందని ఈ రోజుతో ఋజువైనదని తనలో తనే మనసే ఇలా మురిసిందిలే...హో..హో.. దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే అలవాటు లేని ఈ పులకింత తన రూపమే గదా మనసంతా ఇది ప్రేమ కాక మరి ఏంటంటా No doubt no doubt no doubt no ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ

Sambaram : Pattudalato Song Lyrics (పట్టుదలతో చేస్తే )

చిత్రం : సంబరం (2003)

సంగీతం : ఆర్. పి. పట్నాయక్

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : మల్లిఖార్జున్



పల్లవి:

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడకా నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడూ వెనకడుగేయకా ఏ అడుగూ తడబడనీయకా నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

చరణం : 1

ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యనే కష్టం అంటే దూది కూడా భారమే లక్ష్యమంటూ లేని జన్మే దండగా లక్షలాది మంది లేదా మందగా పంతం పట్టీ పోరాడందే కోరిన వరాలు పొందలేరు కదా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

చరణం : 2

చేస్తూ ఉంటే ఏ పనైనా సాద్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా ఎక్కలేని కొండనేదీ లేదురా నవ్వే వాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జెయించి సాగిపోరమరి

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడకా నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడూ వెనకడుగేయకా ఏ అడుగూ తడబడనీయకా నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా


Sambaram : Enduke Ila Song Lyrics (ఎందుకే ఇలా )

చిత్రం : సంబరం (2003)

సంగీతం : ఆర్. పి. పట్నాయక్

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఆర్. పి. పట్నాయక్



పల్లవి:

ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా కన్నీటిని కురిపించాలా ఙ్ఞాపకమై రగిలించాలా మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

చరణం : 1

తప్పదని నిను తప్పుకొని వెతకాలి కొత్తదారి నిప్పులతో మది నింపుకుని బ్రతకాలి బాటసారి జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా ఒంటిగా నను ఎన్నడు వదిలుండనందిగా నువ్వూ నీ చిరునవ్వు చేరని చోటే కావాలి ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

చరణం : 2

ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా  రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక జన్మలో నువ్వు లేవని ఇకనైన నన్ను నమ్మని నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేను వెలివేసుకొని దూరం అవుతున్నా ఎందుకే ఇలా గుండె లోపలా ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా